Take a fresh look at your lifestyle.

‌ప్రజాతంత్ర డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ

సుబేదారి (హన్మకొండ), జనవరి 4, (ప్రజాతంత్ర విలేకరి) : ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక ప్రచురించిన 2022 క్యాలెండర్‌, ‌డైరీ ని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమాచారం పౌర సంబంధాల డిప్యూటీ డైరెక్టర్‌ ‌లక్ష్మణ్‌ ‌కుమార్‌, అసిస్టెంట్‌ ‌పబ్లిక్‌ ‌రిలేషన్‌ ఆఫీసర్‌( ఏపీ ఆర్‌ ఓ) ‌రఫీ, ప్రజాతంత్ర పాత్రికేయులు ఎన్‌.‌బుచ్చిరెడ్డి, పి.కిరణ్‌రెడ్డి, డాక్టర్‌ ఆర్‌.ఆదిరెడ్డి, బి.శ్రీనివాస్‌, ‌సంతోష్‌కుమార్‌, ‌రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాలనాధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు మాట్లాడుతూ పత్రికా వ్యవస్థ ఆధ్వర్యంలో క్యాలెండర్‌, ‌డైరీలను ముద్రించడం మంచి సంప్రదాయం అని అన్నారు. నిత్యం పాత్రికేయులు సమాజంలో జరుగుతున్న వివిధ సంఘటనలను సమాజానికి అందించడానికి ప్రభుత్వానికి, సమాజానికి ఒక వారధిగా ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

Leave a Reply