Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కారేపల్లి, ఏప్రియల్‌ 27, (‌ప్రజాతంత్ర విలేకరి) : మండల పరిధిలోని విశ్వనాధపల్లిలో సోమవారం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆత్మ కమిటి చైర్మన్‌ ‌ముత్యాల సత్యనారాయణ, సొ•సైటీ చైర్మన్‌ ‌దుగ్గినేని శ్రీనివాస రావు, ఎంపిపి మాలోతు శకుంతల ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించటంలో, రైతు పండించిన ప్రతి పంట కొనుగోలు, గిట్టుబాటు ధర అందించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని లాక్‌డౌన్‌ ‌సందర్బంలో రైతులు ఇబ్బందులు పడకూడదని భావించి ప్రతిమండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసిందన్నారు.

రైతులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎం‌పిపి రావూరి శ్రీనివాసరావు, సర్పంచ్‌ ‌హలావత్‌ ఇం‌దిరాజ్యోతి, కిషోర్‌, .‌జడ్పిటిసి వాంకుడోతు జగన్‌, ఎం‌పిటిసి వడ్డె అజయ్‌బాబు, టిఆర్‌ఎస్‌ ‌మండల అధ్యక్షకార్యదర్శులు తోటకూరి పిచ్చయ్య, అజ్మీర వీరన్న, సొసైటీ డైరక్టర్లు ఎవో ఉమామహేశ్వర్‌రెడ్డి, సిఇఓ బొల్లు హన్మంతరావు, మండల టిఆర్‌ఎస్‌నాయకులు,గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!