Take a fresh look at your lifestyle.

నవ్వు-నవ్వించు

నవ్వు ఒక వరం
సదా నవ్వితే
కలిగించు భోగం
రాకుండా చేసును
నీకు రోగం
దూరం చేయును
నీకు దుఃఖం
కలిగించు సుఖం
గైకొను నీలో అందం
అందించు సౌఖ్యం
పెంపొందించు స్నేహం
దగ్గర చేయును బంధం
అంతిమంగా జీవితంలో
నవ్వే ప్రధానం
నవ్వు లేని బ్రతుకు వ్యర్థం
నవ్వ లేని బ్రతుకుకు
దొరకదు అర్థం.. పరమార్థం.
కానీ ఈ నవ్వు కు ఎందుకు
నవ్వుల దినోత్సవమని
ఒక రోజు?
నవ్వుతుండాలి రోజు…
నవ్విస్తుండాలి అందరినీ
ప్రతి రోజు…!
నవ్వుపై అందరూ
పెంచుకోవాలి మోజు..!!

ఎన్‌..‌రాజేష్‌, (‌కవి,జర్నలిస్ట్)
‌హైదరాబాద్‌

Leave a Reply