Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌లో.. కొరోనా కలకలం

  • ఎప్పటికప్పుడు పర్యవేక్షస్తున్న మంత్రులు
  • ఆంక్షలను పాటించకపోవడంతో పెరుగుతున్న కేసులు
  • కంటైన్మెంట్‌ ‌జోన్లలో కఠిన నిబంధనలు అమలు

హైదరాబాద్‌లో కొరోనా విస్తరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇది మరింత విస్తరించి రెడ్‌జోన్‌లోకి వెళ్లకుండా చూడాలి. లేకుంటే ఇక్కడ అనేకానేక సంస్థలు, కంపెనీలు నడవడం  కష్ట సాధ్యంగా  మారవచ్చు. ఎప్రిల్‌ 14 ‌నాటికి కష్టాలు గట్టెక్కాల్సి ఉన్నా… అనుకోని ఉపద్రవం వల్ల హైదరాబాద్‌లో పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం నాడు కొత్తగా మరో 66 కేసులు నమోదు కావడంతో తెలంగాణాలో కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 766కు చేరింది. ఇందులో 37కేసులు హైదరాబాద్‌కు చెందినవి. హైదరాబాద్‌లో ఈ వైరస్‌ ‌విలయతాండవం చేస్తోంది. పాతబస్తీలో కరోనా వేగంగా విస్తరిస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మంత్రులు కెటిఆర్‌, ఈటెల రేజేందర్‌, ‌తలసాని శ్రీనివాసయాదవ్‌,
‌సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌లు ఎక్కడిక్కడే సక్షలు చేస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు. పాతబస్తీలో మర్కజ్‌ ‌లింకులు ఉండడం.. అలాగే ఆయా కుటుంబాల్లో ఎవరైనా వృద్ధులు చనిపోతే అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది. ఆ నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురు మాత్రమే అంత్యక్రియలకు హాజరవ్వాలని.. కానీ ఇటీవల జరిగిన రెండు సంఘటనల్లో అంత్యక్రియలకు వారి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మూడు రోజుల వ్యవధిలో 50కి పైగా పాజిటీవ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. పాతబస్తీలో మూడు ప్రాంతాలను అధికారులు రెడ్‌ ‌జోన్లుగా ప్రకటించారు. తలాబ్‌ ‌కట్ట, రమ్నస్‌పురా, అలీబాగ్‌. ‌హైదరాబాద్‌లో రోజురోజుకి కరోనా భాదితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు వాహనాల ద్వారా కరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక పరికరంతో ఫాగ్‌ ‌శానిటైజేషన్‌ ‌చేస్తున్నారు.

ప్రతి పోలీసు వాహనంలో ఫాగ్‌ ‌శానిటైజేషన్‌ ‌చేయిస్తున్నారు. దాని వలన వచ్చే మూడు నెలల వరకు ఎలాంటి బ్యాక్టీరియా వాహనాల్లోకి చేరదన్న ఉద్దేశంతో ఫాగ్‌ ‌శానిటైజేషన్‌ ‌నిర్ణయాన్ని తీసుకున్నారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో ఇప్పట్టి వరకు 409 కేసులు నమోదయ్యాయి. ఇందులో 44 మంది కోలుకున్నారు. 12 మంది చనిపోయారు. కరోనా పాజిటివ్‌ ‌కేసుల్ని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ ‌లోకేశ్‌ ‌కుమార్‌ ‌వెల్లడించారు. కరోనా సోకిన వారిని కలిసిన వ్యక్తులకు కూడా వైద్య పరీక్షలు చేసినట్టు ఆయన తెలిపారు.  కంటైన్‌మెంట్‌ ‌జోన్లపై సర్కారు నిఘా పకడ్బందీగా కొనసాగనుంది. జిల్లాలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదైన ప్రాంతాలను20 కంటైన్మెంట్‌ ‌జోన్లుగా విభజించా రు. జిల్లా పరిధిలో కి వచ్చే జీహెచ్‌ఎం‌సీ ఏరియా లో 11, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతోపాటు గ్రా ణ ప్రాంతాల్లో కలిపి మరో 9 కంటైన్మెంట్‌ ‌ప్రాంతాలను గుర్తించారు. ఈ జోన్లపై పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. ఎంట్రీ.. ఎగ్జిట్‌ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలను పూర్తిగా నియంత్రిస్తున్నారు.బయటివారు ఈ జోన్లలోకి.. ఇక్కడివా రు బయటకు వెళ్లకుండా 24 గంటలపాటు నిఘాను ఏర్పాటు చేశారు. ఇక్కడ నివసిస్తున్న వారికి నిత్యావసరాల కొరత రాకుండా యంత్రాంగం దృష్టి సారించింది.అన్ని అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యతలను కొందరు అధికారులకు కట్టబెట్టింది. ప్రతిరోజు కంటైన్‌మెంటు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానికులఇబ్బందులను వారు అడిగి తెలుసుకొంటు న్నారు. నిత్యావసరాలు ఆయా ప్రాంతాలకే వచ్చేలా చేశారు.క్వారంటైన్‌ ‌కేంద్రం,•ం
క్వారంటైనులో ఉన్నవారిపై అధికారులు ప్రత్యేకదృష్టి సారించారు. నిర్బంధ ప్రాంతాల్లో సుమారు 30వేల నివాసాలు ఉండగా.. ఇక్కడ మొత్తం 1.38 లక్షల మంది నివసిస్తున్నారు. ఈ ఇళ్లపై పోలీసుల నిఘా కొనసాగుతోంది. అలాగే స్థానికుల ఆరోగ్య పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం వాకబు చేస్తున్నారు. జిల్లా పరిధిలోకి వచ్చే జీహెచ్‌ఎం‌సీ ప్రాంతంలోని కంటైన్మెంట్‌ ‌జోన్లలో ఒక్కో బృందం నిత్యం 70 ఇళ్లకు వెళ్లే ఆరాతీస్తోంది.

 

వివిధ రాష్టాల్రు, దేశాల నుంచి వచ్చిన, మర్కజ్‌ ‌నేపథ్యం ఉన్న వారందరినీ 28 రోజులపాటు •ం క్వారంటైన్‌ ‌చేస్తున్నారు. గతనెల ఒకటి నుంచి అదే నెల 22వ తేదీ వరకు విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 4,654 ప్రయాణికుల్లో ఇప్పటివరకు సుమారు 4వేల మంది 28 రోజుల •ం క్వారంటైన్‌ ‌పీరియడ్‌ని పూర్తిచేసుకున్నారు. మిగిలిన మరో రు వందలకుపైగా ప్రయాణికులు స్వీయ నిర్బధంలో ఉంటున్నారు. అలాగే మర్కజ్‌ ‌నేపథ్యంలో పాజిటివ్‌ ‌కేసులకు సంబంధించిన 663 ప్రైమరీ కాంటాక్టులు కూడా •ం క్వారంటైన్‌లోనే ఉన్నారు. •ం క్వారంటైన్‌లో ఉన్నవారందరిపైనా నిఘా కొనసాగుతూనే ఉంది. పాతబస్తీ ఘటనల నేపథ్యంలో కంటైన్మెంట్‌ ‌జోన్స్ ‌నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కే తారక రామారావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్‌ ‌జోన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిలో జిహెచ్‌ఎం‌సి పరిధిలోనే 146 జోన్లు ఉన్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లోని 43 మున్సిపాలిటీలలో మిగిలిన 114 కంటైన్మెంట్‌ ‌జోన్లు ఏర్పాటు చేశారు.
కంటైన్మెంట్‌ ‌జోన్లలో వున్న ప్రజలను ఇండ్లకే పరిమితం చేశారు. మున్సిపల్‌ ‌కమిషనర్లు, జోనల్‌ ‌కమిషనర్ల స్థానికంగా పర్యవేక్షిస్తున్నారు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, మెడిసిన్స్ ‌ను ఇండ్ల వద్దకే సరఫరా చేస్తున్నారు. తదనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నియమించిన వాలెంటీర్లు, సిబ్బందిచే మాత్రమే నిత్యవసరాలను డోర్‌ ‌డెలవరీ చేయించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు ఆదేశించారు. కొత్త కేసులు నమోదు కాకుండా కంటైన్మెంట్‌ ‌నిబంధనలపై అవగాహన కల్పించి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Leave a Reply