Take a fresh look at your lifestyle.

భారత్‌ ‌జోడో యాత్రలో ఆఖరి రోజు..

  • 7న మెనూరు వద్ద భారీ బహిరంగ సభ
  • చారిత్రాత్మక సభ జరగబోతుంది.. భారీగా ప్రజలు తరలిరావాలి..రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ పిలుపు

హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 7వ తేదీన రాత్రి తెలంగాణ లో ముగుస్తుందని ఆ రోజు జుక్కల్‌ ‌తర్వాత మెనూరులో పెద్దఎత్తున చారిత్రాత్మక బహిరంగ సభను నిర్వహించనున్నామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి వికృమార్క, ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీలు ఒక ప్రకటనలో తెలిపారు..తెలంగాణ రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రకు ప్రజల నుంచి అద్భుత స్పందన, మద్దతు లభించాయని వారు అన్నారు. అక్టోబర్‌ 23‌న కర్ణాటక నుంచి తెలంగాణ లోని మక్తల్‌ ‌లో అడుగు పెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 27వ తేదీ నుంచి వరసగా జరిగిందని వారు అన్నారు. పాదయాత్ర లో ప్రజలు స్వచ్ఛందంగా పద్దయెత్తున పాల్గొని రాహుల్‌ ‌గాంధీ కి సంఘీభావం ప్రకటించారని వారు వివరించారు.

అనేక వరఫల వారు సామాజిక కార్యకర్తలు, కుల సంఘాలు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, బాధితులు, మహిళ సాధికారిత కార్యకర్తలు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, చిన్న పిల్లలు, క్రేడకారులు ఇలా అనేక వర్గాల వారు రాహుల్‌ ‌గాంధీ కి కలిసి వారి సమస్యలు వివరించారని ఆయన వారితో సానుకూలంగా మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నారని వారు తెలిపారు. అక్టోబరు 23న ప్రారంభమైన పాదయాత్ర నవంబర్‌ 7‌న తెలంగాణ లో.ముగుస్తుందని ఆ రోజు రాత్రి మహారాష్ట్ర లో అడుగు పెడుతున్నారని అన్నారు. తెలంగాణ సమాజం రాహుల్‌ ‌కు అండగా నిలబడిందని ఇంత పెద్దఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణలో యాత్రలో పూర్వ మహబూబ్‌ ‌నగర్‌, ‌రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మెదక్‌, ‌నిజామాబాద్‌ ‌జిల్లాలో సాగిందని అన్నారు..ఆదిలాబాద్‌, ‌పెద్దపల్లి, కరీంనగర్‌, ‌జహీరాబాద్‌, ‌నిజామాబాద్‌ ‌పార్లమెంటు నియోజకవర్గాల నేతలకు పాదయాత్రలో పాల్గొనే అవకాశం రాలేదని అన్నారు. 7వ తేదీన జరిగే చివరి సభకు ప్రజలు భారీగా వచ్చి రాహుల్‌ ‌కు మద్దతు పలకాలని వారు పిలుపునిచ్చారు.. సమావేశం అనంతరం రాత్రి 9.30 కు దెగ్లూరులో మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌యాత్రను పరిచయం చేయబోతున్నామని తెలిపారు.

Leave a Reply