- మైక్రోసాప్ట్, అమెజాన్, కిటెక్స్ తదితర కంపెనీల రాక
- ప్రాంత అభివృద్దికి ప్రత్యేక చర్యలు
- వెల్ స్పన్ టెక్స్‌టైల్ యూనిట్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం చందన్‌వెల్లిలో ఏర్పాటుకాబోతుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. బాలకృష్ణ గొయెంక 1985లో ఒక సంస్థను స్థాపించి..ఈ రోజు గుజరాత్‌లో 25వేల మందికి ఉపాధికి కల్పిస్తున్నారని ప్రశంసించారు. గుజరాత్‌తో పాటు అమెరికాలోను పెట్టుబడులు పెట్టారన్నారు. ఆయన తొలిసారిగా గుజరాత్ నుంచి బయటకు వొచ్చి తెలంగాణలో వెల్‌స్పన్ సిటీని ఏర్పాటు చేశారంటూ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ప్రారంభించిన పరిశ్రమ యూనిట్‌ను గుజరాత్‌లో కచ్‌లోని ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్రణాళిక రూపొందించుకుందని, ఆయనను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన కచ్‌లో యూనిట్ స్థాపనను విరమించుకొని చందన్‌వెల్లిలో ఏర్పాటు చేశారన్నారు. రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో వెల్ స్పన్ టెక్స్‌టైల్ యూనిట్‌ను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ…ఐదేళ్ల కిందట చందన్‌వెల్లి, సీతారాంపూర్‌లో ఎక్కడ వెతికినా ఒక్క పరిశ్రమ లేని పరిస్థితి ఉండేదని, అలాంటి చందన్‌వెల్లిలో వెల్‌స్పన్ యాంకర్‌గా వచ్చిన తర్వాత మైక్రోసాప్ట్, అమెజాన్, కిటెక్స్ తదితర చాలా కంపెనీలు వొచ్చాయన్నారు. తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం ఇక్కడే ఏర్పాటుకాబోతుందని తెలిపారు. బాలకృష్ణ గొయెంక 1985లో ఒక సంస్థను స్థాపించి.. ఈ రోజు గుజరాత్‌లో 25వేల మందికి ఉపాధికి కల్పిస్తున్నారని ప్రశంసించారు. గుజరాత్‌తో పాటు అమెరికాలోను పెట్టుబడులు పెట్టారన్నారు. ఆయన తొలిసారిగా గుజరాత్ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో వెల్‌స్పన్ సిటీని ఏర్పాటు చేశారంటూ ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ ప్రారంభించిన పరిశ్రమ యూనిట్‌ను గుజరాత్‌లో కచ్‌లోని ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్రణాళిక రూపొందించుకుందని, ఆయనను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు తెలిపారు. ఐదేళ్ల కిందట చందన్‌వెల్లి, సీతారాంపూర్‌లో ఎక్కడ వెతికినా ఒక్క పరిశ్రమ లేని పరిస్థితి ఉండేదని, అలాంటి చందన్‌వెల్లిలో వెల్‌స్పన్ యాంకర్‌గా వొచ్చిన తర్వాత మైక్రోసాప్ట్, అమెజాన్, కిటెక్స్ తదితర చాలా కంపెనీలు వొచ్చాయన్నారు.
ఇప్పటికే రూ.2వేలకోట్లతో రెండు యూనిట్లు ప్రారంభమయ్యాయని, రాబోయే ఐదారేళ్లలు రూ.3వేల నుంచి రూ.5వేలకోట్ల పెట్టబుడులు తెలంగాణలో పెడుతామని బాలకృష్ణ గొయెంకా చెప్పారన్న కేటీఆర్, మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతంలో మ్యానుప్యాక్చరింగ్ పరిశ్రమ రావొచ్చని కేటీఆర్..రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, వికారాబాద్, మహేశ్వరం జిల్లాలకు వెళ్లిన సందర్భంలో మాకు ఐటీ పరిశ్రమలు కావాలని అగుడుతున్నారన్నారు. మాకు ఐటీ పరిశ్రమ ఎందుకు రాదని? ఐటీ కొండాపూర్, గచ్చిబౌలిలోనే ఉండాలా? అని అంటున్నారని, 1000-1200 మంది ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఇచ్చేందుకు ఐటీ సెంటర్ ఏర్పాటు చేస్తామని బీకే గొయెంక ప్రకటించారని తెలిపారు. స్థానికంగా ఐటీ యాక్టివిటీ ప్రారంభమైతే చాలా మంది యువత హైదరాబాద్‌కు, బెంగళూరుకు వెళ్లాల్సిన పని లేకుండా స్థానికంగానే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి చందన్‌వెల్లి వరకు మెరుగైన రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.
తెలంగాణలో అద్భుతంగా పత్తి ఉత్పత్తవుతుందని, ఎక్కడో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని గొయెంకా చెప్పారని, దాంతో స్థానిక రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పారన్నారు. సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ సైతం తెలంగాణ ఉత్పత్తిని ప్రశంసించిందని కేటీఆర్ తెలిపారు. ఐకియాతో వెల్‌స్పన్‌కు ఒప్పందం ఉందని, ఇందులో స్థానిక మహిళలను భాగస్వాములను చేస్తే.. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్‌స్పన్ ప్రతినిధులు చెప్పడం సంతోషకరమన్నారు. స్థానిక స్కిల్ డెవలప్‌మెంట్ ఏర్పాటు చేసి మహిళలు, యువతకు శిక్షణ ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ తరహాలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని కేటీఆర్ తెలిపారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం నాలుగేళ్లలో పూర్తి చేసిందన్న కేటీఆర్.. దురదృష్టవశాత్తు కొన్ని కారణాలతో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు. కరెంటు సమస్యలను ఎలా పరిష్కరించామో, పారిశ్రామిక సమూహాలు ఎలా ఏర్పాటు చేసి పిల్లలకు ఎలా ఉపాధి అవకాశాలు పెంచుకుంటున్నామో.. అలాగే పాలమూరు ? రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలో పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకుందామన్నారు. అంతకు ముందు వెల్‌స్పన్ గ్రూప్ చైర్మన్ బాలకృష్ణ గొయెంక మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టి చందన్ వెల్లిని వెల్‌స్పన్ వ్యాలీగా మారుస్తామని చెప్పారు. మంత్రి కేటీఆర్ విజన్.. చందన్‌వెల్లి టూ సిలికాన్ వ్యాలీ అన్న కేటిఆర్.. సీఎం కేసీఆర్ అద్భుత దార్శనికతతో ముందుకెళ్తున్నారంటూ ప్రశంసించారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.