Take a fresh look at your lifestyle.

ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి : కలెక్టర్‌

వరంగల్‌ ‌తూర్పు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఖాళీ స్థలాల్లో హరితహారం కార్యక్రమంలో పెద్ద యెత్తున మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు అన్నారు. శుక్రవారం కలక్టరేట్‌ ‌మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌, ‌వరంగల్‌ ‌తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, ‌జిడబ్ల్యుఎంసి పమేలా సత్పతితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ ‌మాట్లాడుతూ హరిత హరం కార్యక్రమంలో జిల్లాలో ఈ సంవత్సరం జిల్లా స్థాయిలో 23 లక్షలకు పైగా ప్రణాళిక సిద్దం చేసుకోగా అంత కంటే ఎక్కువగా 53 లక్షల 75 వేలకు మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యం లో ప్రభుత్వ ఇచ్చిన టార్గెట్‌ ‌సాధించాలంటే అందరూ భాగస్వామ్యం కావల్సిన అవశ్యకత ఉందని చెప్పారు. అందుకు ఖాళీ స్థలాల్లో మొక్కలు పెద్ద యెత్తున చేపట్టాలని సంకల్పంతో ముందుకు పోవాలని అన్నారు. ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌ ‌మాట్లాడుతూ నగరంలో ఖాళీ స్థలాల్లో మియా వాకి యాదాద్రి మోడల్‌ ‌మొక్కలు నాటిన నేపథ్యం లో లక్ష్యాన్ని సాధించవచ్చునని సూచించారు. పశ్చిమ నియోజకవర్గంలో పరిధిలో ప్రతి వార్డులో కాలని, అపార్ట్‌మెంటు వాళ్ళను సంప్రదించి మొక్కలు నాటేందుకు దోహద పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

వార్డుకు వెయ్యి మొక్కలు నాటే విధంగా కార్యాచరణ చేయాలన్నారు. పచ్చదనం తో నగర వాసులకు మంచి వాతావరణం తో పాటుగా వాతావరణ సమతుల్యం చెందుతుందని పట్టణంలో వాహన కాలుష్యం ఇతర కాలుష్యం వలన నగరవాసులు ఇబ్బందులను అధిగమించిన వారౌతరని భవిష్యత్తు తరాలవారికి మనం అందించే గొప్ప వరమన్నారు. వరంగల్‌ ‌పశ్చిమ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ ‌మాట్లాడుతూ పట్టణంలో కోతుల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు గుర్తించిన మంకీ ఫుడ్‌ ‌కోర్టు కాకుండా అదనంగా మరో 20 నుండి 30 మంకీ ఫుడ్‌కోర్టులను అనువైన స్థలాలను నగరంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఖిలా వరంగల్‌ ‌ప్రాంతం లో ఆకర్షణీయమైన తరహా మొక్కలు నాటాలని సూచించారు. కమిషనర్‌ ‌పమేలా సత్పతి మాట్లాడుతూ కార్పొరేషన్‌కు 36 లక్షలు, కుడాకు 5 లక్షల మొత్తం41లక్షల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం లక్ష్యాన్ని కేటాయించినట్లు జిల్లా టార్గెట్‌లో 70 శాతం వాటా ఉందన్నారు. కార్పొరేషన్‌ ‌నర్సరీలతో పాటుగా హెచ్‌ ఏం ‌డి ఏ ద్వారా కూడా సుమారు 3 లక్షల మొక్కలను అందించాలని నిర్దేశించి నేపథ్యంలో మొక్కలకు సమస్య లేదని లక్ష్యాన్ని సాధించేందుకు వార్డు వారిగా ప్రణాళికలను సిద్దం చేసుకొని ముందుకు పోతున్నట్లు చెప్పారు. శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్‌ ‌సూచించిన మేరకు లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వాసు చంద్ర, యస్‌ అర్‌ ‌యస్‌ ‌పి స్టేజి 1 పర్యవేక్షక ఇంజనీర్‌ ‌వెంకటేశ్వర్లు మునిసిపాలిటీ ఎస్‌ఈ ‌విద్యాసాగర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!