Take a fresh look at your lifestyle.

పట్టణాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట

  • మున్సిపల్‌ ‌పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి కెటిఆర్‌
  • ‌రాష్ట్రంలో 3500 కోట్ల పెట్టుబడులకు కైటెక్స్ ఆసక్తి : మంత్రి కెటిఆర్‌తో కంపనీ ప్రతినిధుల భేటీ

కొరోనా వేళ పట్టణాల్లో మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేశామని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. అన్ని పట్టణాల్లో వ్యర్థాలు, మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మూసీ నదిపై 15 కొత్త బ్రిడ్జిల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర మున్సిపల్‌ ‌పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి.. 2020-21 సంవత్సరానికి గాను వార్షిక నివేదికను ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ ‌శుక్రవారం విడుదల చేశారు. పీఎం స్వనిధి అమల్లో దేశంలోనే మనం ముందంజలో ఉన్నామన్నారు. వీధి వ్యాపారులకు రూ. 347 కోట్ల రుణాలు ఇచ్చామని తెలిపారు. రూ. 184 కోట్లతో దుర్గం చెరువుల తీగల వంతెన నిర్మించామని గుర్తు చేశారు.

జీడిమెట్లలో 500 టీపీడీ సామర్థ్యంతో భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్‌ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జవహర్‌నగర్‌లో చెత్త నుంచి 19.8 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓఆర్‌ఆర్‌ ‌పై 136 కిలో మిటర్ల పొడవునా ఎల్‌ఈడీ దీపాలు, 10 ట్రామా రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రూ. 30 కోట్లతో ట్యాంక్‌బండ్‌పై సుందరీకరణ పనులు చేపట్టామని కేటీఆర్‌ ‌తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ అర్వింద్‌ ‌కుమార్‌, ‌మున్సిపల్‌ ‌శాఖ కమిషనర్‌, ‌డైరెక్టర్‌ ‌సత్యనారాయణ, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ ‌రెడ్డి, జలమండలి ఎండీ దాన కిశోర్‌, ‌జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ ‌లోకేశ్‌ ‌కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 3500 కోట్ల పెట్టుబడులకు కైటెక్స్ ఆసక్తి : మంత్రి కెటిఆర్‌తో కంపనీ ప్రతినిధుల భేటీ
ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో కైటెక్స్ ‌కంపెనీ ప్రతినిధులు సమావేశం అయ్యారు. కేరళకు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కైటెక్స్..‌రాష్ట్రంలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తుంది. ఈ సందర్భంగా జౌళి రంగంలో పెట్టుబడుల యోచనపై మంత్రితో ఆ బృందం చర్చించింది. పారిశ్రామిక విధానాలు, జౌళి రంగంలో అవకాశాలను మంత్రి కేటీఆర్‌ ‌వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ ‌బాల్క సుమన్‌, ‌కైటెక్స్ ‌గ్రూపు చైర్మన్‌, ఎం‌డీ సాబ్‌ ఎం ‌జాకబ్‌, ‌పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ జయేశ్‌ ‌రంజన్‌, ‌హ్యాండ్లూమ్స్, ‌టైక్స్‌టైల్స్ ‌కమిషనర్‌ ‌శైలజా రామయ్యర్‌, ‌టీఎస్‌ఐఐసీ లిమిటెడ్‌ ఎం‌డీ నర్సింహారెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply