Take a fresh look at your lifestyle.

వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్దపీట

  • లక్షకోట్లతో ఆదుకునే ప్రయత్నం
  • కోల్డ్‌స్టోరేజ్‌లు, ధాన్యాల గిడ్డంగుల నిర్మాణం
  • లాక్‌డౌన్‌లో రైతుల ఖాతాల్లో రూ 18,700 కోట్ల నగదు బదిలీ
  • రైతుల నుంచి రూ 74,300 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు
  • డెయిరీ రైతులకు రూ 5వేల కోట్లతో అదనపు సాయం
  • 2 కోట్ల మంది డెయిరీ రైతులకు లబ్ది
  • మూడోరోజు వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌

‌ప్రధాని ప్రకటించిన ఆత్మనిర్భరతా భారత్‌ ‌పథకంలో బాగంగా వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ నిధుల కేటాయింపులను ప్రకటించారు. మూడోరోజు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌,‌ సహాయమంత్‌ఇర అనురాగ్‌ ‌ఠాకూర్‌లు డియా సమావేశంలో చేసిన ప్రకటనలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. డెయిరీ పరిశ్రమలు, మత్స్య, ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ఉత్పత్తులకు ప్యాకేజీని ప్రకటించారు. ఇందు కోసం 11 అంశాల్లో రాయితీలు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ధాన్యం, గోధుమల ఉత్తత్తిలో స్వయం సమృద్ధి సాధించామని చెప్పారు. లాక్‌డౌన్‌ ‌సమయంలో కనీస మద్ధతు ధరల ప్రకారం రైతుల నుంచి పంటలు కొనుగోలు చేశామని చెప్పారు. రైతులకు రూ. 74,300కోట్లు చెల్లించినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇదే సమయంలో 2 నెలల్లో ఫసల్‌ ‌భీమా యోజన కింద రూ. 6400 కోట్లు రైతులకు పరిహారంగా చెల్లించామన్నారు. పీఎం కిసాన్‌ ‌పథకం ద్వారా రూ. 18, 700 కోట్ల నిధులను రైతులకు పెట్టుబడి సాయంగా చేసినట్లు నిర్మలా సీతారామన్‌ ‌చెప్పారు. వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కోసం రూ లక్ష కోట్లతో నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ధాన్యం, గోధుమల ఉత్తత్తిలో స్వయం సమృద్ధి సాధించామని, దేశంలో 85 శాతం వ్యవసాయ కమతాలు చిన్న, సన్నకారు రైతులవేనని ఆమె చెప్పారు. వర్షాభావం, వాతావరణ సమస్యలు అధిగమించి రైతులు శ్రమిస్తున్నారని నిర్మల గుర్తుచేశారు.

చెరకు, పత్తి, వేరుశనగ, పప్పుధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో మనం రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. లాక్‌డౌన్‌ ‌సమయంలో పాలసేకరణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌చెప్పారు. సహకార డెయిరీల ద్వారా మిగులు పాలను సేకరించామని..దీని ద్వారా పాడి రైతులకు రూ. 4100 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చినట్లు ఆమె స్పష్టం చేశారు. పాడి రైతులకు రూ. 5వేల కోట్లతో ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. దీని ద్వారా 2 కోట్ల మంది పాడి రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. సహకార రంగంలోని డెయిరీలకు 2 శాతం వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రూ.13,300 కోట్లతో పాడిపశువులకు టీకా వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పాడి పశువులకు సకాలంలో టీకాలు వేయించే పరిస్థితి లేక బీమా నష్టం జరుగుతోందని ప్రధాని జనవరిలోనే చెప్పారని, పాడి పరిశ్రమను ఇబ్బందుల నుంచి కాపాడేందుకు దేశ స్థాయిలో విస్తృత టీకా కార్యక్రమం చేపట్టనున్నట్లు నిర్మల ప్రకటించారు.మత్స్యకారుల కోసం రూ.20 వేల కోట్లతో పీఎం మత్స్య సంపద యోజన పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. 55 లక్షల మందికి ఉపాధి కల్పించేలా, దేశ ఆక్వా ఉత్పత్తులు రెట్టింపయ్యేలా కార్యాచరణను సిద్ధం చేసినట్లు నిర్మల ప్రకటించారు.

గడువు తీరిన 242 ఆక్వా హేచరీలకు రిజిస్టేష్రన్‌ ‌గడువు 3 నెలలు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కోల్డ్ ‌స్టోరేజీలు లాంటి ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఇందులో కల్పించుకోవచ్చని నిర్మల ప్రకటించారు. తెలంగాణ పసుపును, ఆంధ్రా మిర్చిని నిర్మల ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ఈ రెండింటికీ ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇలాంటి ఉత్పత్తులను ప్రపంచ స్థాయిలో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కోల్డ్‌స్టోరేజ్‌లు, ధాన్యాల గిడ్డంగుల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామన్నారు. లాక్‌డౌన్‌లో రైతుల ఖాతాల్లో రూ 18,700 కోట్ల నగదు బదిలీ,రైతుల నుంచి రూ 74,300 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు,డెయిరీ రైతులకు రూ 5వేల కోట్లతో అదనపు సాయం,2 కోట్ల మంది డెయిరీ రైతులకు లబ్ది,రూ 30 వేల కోట్లతో రైతులకు అత్యవసర సహాయ నిధి,ఆక్వా రైతుల ఎగుమతుల కోసం ప్రత్యేక కార్యాచరణ, స్ధానిక ఉత్పత్తుల ఎగుమతుల కోసం రూ 10,000 కోట్లతో నిధి,చిన్నతరహా ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌సంస్ధల కోసం రూ 10,000 కోట్లతో నిధి,రెండు లక్షల ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్లకు లబ్ది,మత్స్య అనుబంధ రంగాలకు రూ 20,000 కోట్లు,మెరైన్‌ ఎగుమతుల పెంపునకు 55 లక్షల ఉద్యోగాలు,ఆక్వా కల్చర్‌కు రూ 11,000 కోట్లతో నిధి, ప్రధాని మత్స్యసంపద యోజన కింద రూ 20,000 కోట్లతో నిధి,మత్స్యకారులకు బీమా సౌకర్యం,పశుసంవర్ధక మౌలిక వసతులకు రూ 15,000 కోట్లు,పశువులు, జీవాలకు వ్యాక్సిన్‌ల కోసం రూ 13,300 కోట్లు,53 కోట్ల జీవాలకు నూరు శాతం వ్యాక్సినేషన్‌,ఔషధ మొక్కల సాగుకు రూ 4000 కోట్లతో నిధి,తేనెటీగల పెంపకందారులకు రూ 5000 కోట్లు, ధరల నియంత్రణకు నిత్యవసర చట్టంలో మార్పులు తీసుకుని రావడం వంటివి ఉన్నాయి.

Leave a Reply