Take a fresh look at your lifestyle.

లిక్కర్‌ ‌షాపుల ఎదుట భారీగా గుమిగూడుతున్న జనం

‌తెలంగాణలో కొరోనా వైరస్‌ ‌మరింతగా విస్తరించకుండా ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని మద్యం షాపులన్నింటినీ మూసి వేయాలని టీ పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. బార్లు, పబ్‌ల మూసివేతతో రాష్ట్రవ్యాప్తంగా వైన్‌ ‌షాపుల ఎదు• మద్యం కొనుగోలు కోసం భారీ ఎత్తున ప్రజలు గుమిగూడుతున్నారనీ, దీంతో కొరోనా వైరస్‌ ‌విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన మీడియా ప్రకటనలో లిక్కర్‌ ‌షాపుల ఎదుట గుమిగూడుతున్న ప్రజలు ఎలాంటి శానిటైజేషన్‌ ‌పాటించడం లేదనీ, వారికి ఎక్కడా చెకింగ్‌లు కూడా లేవని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని చాలా వరకు లిక్కర్‌ ‌షాపులు పక్కనే అనధికారికంగా మద్యం సేవించడానికి అనధికారికంగా గదులు ఏర్పాటు చేశాయనీ, వీటిలో ఎలాంటి పరిశుభ్రత ఉండదని పేర్కొన్నారు. ప్రజా భద్రత దృష్ట్యా ఈనెల 31 వరకు లిక్కర్‌ ‌షాపులను మూసివేసేలా వెంటనే ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. అలాగే, కొరోనా వైరస్‌ ‌సోకిన బాధితులు, అనుమానితులను ఏకాంతవాసం చేయడానికి ఆసుపత్రులలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ ‌వార్డులలో ఇతరులకు ఇది వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ, బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్వారంటైన్‌ ‌కేంద్రాలు, ఐసోలేషన్‌ ‌వార్డులలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, ప్రధాని మోదీ సూచించిన విధంగా ఈనెల 22న ప్రజలు జనతా కర్ఫ్యూను పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా గూడూరు నారాయణరెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

Leave a Reply