హరితహారం పేరుతో పోలీసులు అటవీశాఖ అధికారులు సాగుభూములు లాక్కుంటున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు ఆరోపించారు. బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం గ్రామాలకు చెందిన రైతుల భూములు పుష్కరవనం సమీపంలో ఉండగా వాటిని రైతులు 40 సంవత్సరాలుగా సాగు చేస్తున్న కానీ అటవీభూములు అనే పేరుతో అధికారులు సాగు భూముల్లో మొక్కలు నాటడంపై ఆయన మండిపడ్డారు.
రైతుల భూముల్లో హరితహారం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారని దీని వలన అమాయక రైతులు రోడ్డున పడే అవకాశం ఉందని అన్నారు. మంత్రి ని అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నిస్తారని ముందుగానే రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆంధోళన చేసారు.