Take a fresh look at your lifestyle.

భూ కబ్జాలను అడ్డుకుంటే రాద్దాంతం ఎందుకు?

  • అవినీతి కేసులను విచారించడం సరికాదా
  • టిడిపి సమాధానం ఇచ్చుకోవాల్సిందే

విశాఖపట్టణం,జూన్‌ 16 : అవినీతి ఎవరు చేసినా శిక్షార్హులే కావాలి. అయితే ఆ దిశగా ఎవరు చర్యలు తీసుకున్నా స్వాగతించాల్సిందే. జగన్మోహన్‌రెడ్డి పాలన ఫ్యాక్షనిస్టు తరహాలో సాగుతోందన్న విమర్శలు చేస్తూ వస్తోన్న టిడిపి నేతలు అన్ని కేసులను ఒకే గాటన కట్టాలని చూడడం తగదు. గతంలో అచ్చెన్నాయుడు, జెసి ప్రభాకర్‌ ‌రెడ్డిల కేసులను, తాజాగా విశాఖ భూ కబ్జా కేసులను ఒకే గాటన కట్టడం సరికాదు. ఒకవేళ టిడిపి నేతలకు బూ కబ్జాలతో సంబంధం లేకుండా ఉంటే నిగ్గు తేలాలి. అవినీతికి సంబంధించిన చర్చ చేయకుండా టిడిపి నేతలు ఎదురుడదాడి చేయడం సరికాదు. జగన్‌ ఒకవేళ ఫ్యాక్షనిస్ట్ అయితే అది వేరే వ్యవహారం. ఆయనను ప్రజలు ఎన్నుకుని ముఖ్య మంత్రిని చేశారు. కాబట్టి ఆయన అవినీతికి సంబం ధించి విచారణకు ఆదేశిస్తే అది ప్రభుత్వ విధానంగానే చూడాలి. భూ కబ్జాల వంటివి వివాదాస్పదం చేయడం రాజకీయం కాక మరోటి కాదు. చంద్రబాబు నాయుడు అవినీతిని ప్రోత్సహిస్తే అంతకన్నా దారుణం మరోటి ఉండదు. అది జగన్‌ను కూడా అవినీతి చేయాలని ప్రోత్సహించడమే అవుతుంది.

ప్రజా స్వామ్యంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వాలు అవినీతిపై పోరాడాల్సిందే. గతంలో ఎవరు అవినీతికి పాల్పడినా ఊచలు లెక్కించేలా చేయాల్సిందే. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అవినీతికి వకాల్తా పుచ్చుకున్నట్లుగా ఉన్నాయి. ప్రజలు మాకు అధికారం ఇచ్చారంటూ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా నిరంకుశ పోకడలకు పోవడం వల్ల న్యాయస్థానాలు తరచుగా జోక్యం చేసుకోవలసి వస్తోంది. ప్రభుత్వా లకు బాధ్యత గుర్తుచేయాల్సి వస్తోంది. చట్టబద్ధమైన పాలనను అందించడంలో విఫలమవుతున్న ప్రభుత్వాలను కట్టడి చేయవలసిన కేంద్ర ప్రభుత్వం కూడా అజమాయిషీ లేకుండా చూస్తోంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిం చడంతో తమకు తిరుగులేని విధంగా, విపక్షం లేకుండా చేసుకోవడం సరికాదు. విపక్షాలను గౌరవించి వారి మాటలకు కూడా విలువ ఇవ్వాలి. సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగాలి. నియంతలను తలపింపజేసే విధంగా ముఖ్య మంత్రులు వ్యవహరిస్తే ప్రజలు ఎదురుతిరిగే పరిస్థితి రావచ్చు. అందువల్ల అధి కారంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉంటూ.. గతంలో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తే తప్పు లేదు.

అలాగే గతంలో జరిగిన అవకతవకలపై విచారణను అడ్డుకోవాలని కోరుకోవడం కూడా అవినీతిని ప్రోత్సహించడం తప్ప మరోటి కాదు. నిజంగా తప్పు చేసిన వాళ్లు కూడా తనను అక్రమంగా అరెస్టు చేశారనే చెబుతారు. గతంలో మాకూ ఎసిబి ఉందంటూ ఎమ్మెల్సీ కొనుగోళ్లకు సంబంధించిన సమయంలో చంద్రబాబు వ్యాఖ్యానిం చారు. అదే ఎసిబి ఇప్పుడు పనిచేస్తుంటే ఎలా కాదనగలరో చెప్పాలి.

Leave a Reply