Take a fresh look at your lifestyle.

పేదల ఇల్ల కోసం 12 కోట్లతో భూముల సేకరణ

  • వెల్లడించిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు
  • ఇళ్ల నిర్మాణాలను టిడిపి అడ్డుకుంటోందన్న గడికోట

అమరావతి, జూలై 29 : పేదల ఇళ్ల కోసం సీఎం రూ.12 వేల కోట్లతో భూములు సేకరించామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. ఇళ్ళ నిర్మాణంపై విప్‌లు, ఎమ్మెల్యేలతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సక్షలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, 30 వేల ఎకరాలు పేదల ఇళ్ల కోసం సేకరించామని పేర్కొన్నారు. ప్రస్తుతం లే అవుట్‌లుగా అభివృద్ధి చేసి మొత్తం సదుపాయాలు కల్పిస్తున్నామని, పేదలకు మంచి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సీఎం జగన్‌ ‌నిర్ణయించారని తెలిపారు. 30 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇసుక ఇస్తున్నాం.

సిమెంట్‌, ఐరన్‌, ‌మెటల్‌ను తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. లక్షా 80 వేల ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వ సహకారాన్ని అందిస్తున్నాం. ఎమ్మెల్యేలతో చర్చించి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకున్నాం. వాటన్నింటిని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌దృష్టికి తీసుకెళ్తామని‘ శ్రీరంగనాథరాజు తెలిపారు. మొదటగా లే అవుట్లకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. లబ్దిదారులకు నచ్చినట్లు ఇల్లు కట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గతలో 240 చదరపు అడుగులు ఇచ్చేవారు.. ఇప్పుడు 340 చ.అడుగులు ఇస్తున్నామని వివరించారు.

లబ్దిదారుల ప్రాధాన్యత ఆధారంగా నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. రూ.32 వేల కోట్లతో శాశ్వత డ్రైనేజీ, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని, కొత్తగా 17,005 కొత్త కాలనీలు నిర్మిస్తున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు.ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ నిర్మాణాలను అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పేదలకు ఇబ్బంది కలిగించేలా టీడీపీ కోర్టులకు వెళ్లి అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. పేదలకు చరిత్రలో ఎవరూ కట్టనన్ని ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించి ఇస్తున్నారని వివరించారు. సుమారు రూ.50 వేల వరకు సామగ్రి రూపంలో లబ్దిదారులకు మేలు అని తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా జేసీని నియమించినట్లు తెలిపారు.

Leave a Reply