Take a fresh look at your lifestyle.

2022 ‌నాటికి ..సిరిసిల్లకు రైలు త్వరగా భూసేకరణ: మంత్రి కెటిఆర్‌ ఆదేశం

Land acquisition of train to Sirisilla by 2022 Minister KTR
రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సక్షిస్తున్న మంత్రి కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాకు రైలు మార్గం అందు బాటులోకి వస్తే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని మంత్రికెటిఆర్‌ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడికైనా తరలించవచ్చు. మానేరు వాగుపై ఉన్న ఎగువ మానేరు జలాశయం పర్యాటక అభివృద్ధికి అన్ని విధాలా అనుకూలంగా ఉందని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్‌ ‌సక్ష సమావేశం నిర్వహించారు. నియోజక వర్గంలోని అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైల్వే ప్రాజెక్టుతో జిల్లా ముఖచిత్రం మారుతుందని, వచ్చే మే నెలాఖరులోగా భూ సేకరణ పూర్తి చేయాలని అన్నారు. 2022 నాటికి జిల్లాకు రైలు కూత వినపడాలి. భూసేకరణ పక్రియ పూర్తి చేసి రైల్వే లైన్‌ ‌నిర్మాణం చేపట్టేందుకు వీలుగా రైల్వే అధికారులకు అప్పగించాలన్నారు. రైల్వే లైన్‌కు జిల్లాలో అవసరమైన 845 ఎకరాల భూసేకరణను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని మే నాటికి ఈ పక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వందశాతం భూ సేకరణ పూర్తి చేసి.. భూమిని రైల్వే శాఖ అధికారులకు అప్పగించాలన్నారు. చట్టపరమైన చిక్కులు రాకుండా భూసేకరణ అత్యంత పకడ్బందీగా జరగాలని మంత్రి కేటీఆర్‌ ‌సూచించారు. రైల్వే లైన్‌ అలైన్‌ ‌మెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత ప్రభుత్వశాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. చట్టపరమైన చిక్కులు రాకుండా భూసేకరణ పకడ్బందీగా సేకరించాలన్నారు. సంబంధిత అధికారుల సమన్వయంతో వ్యవహరించాలి.

రైల్వే అలైన్‌మెంట్‌ ‌యుటిలిటీ షిప్టింగ్‌లను సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు జాగ్రత్తగా చేపట్టాలి. కాటేజీల నిర్మాణం, బోటింగ్‌, ‌జలక్రీడలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలో పెద్దపీట వేయాలన్నారు. ఎగువ మానేరు జలాశయం అతిథి గృహాన్ని రూ.2కోట్లతో ఆధునీకరించాలి. అతిథిగృహం లోపలి భాగాలను అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దాలి. నర్మాలలో ప్రాసెసింగ్‌ ‌యూనిట్‌ ‌స్థాపన పనులను ప్రారంభించాలి. మరో పది రోజుల్లో మళ్లీ నర్మాలకు వస్తా. ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్‌, అతిథి గృహం ఆధునీకరణ పనులు పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తానని మంత్రి పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌ ‌వివిధ సక్షలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడికైనా తరలించి అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రజలకు తక్కువ ఛార్జీలతో హైదరాబాద్‌ ‌సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వెలుసుబాటు కలుగుతుందన్నారు. ఇక తంగళ్ళపల్లి రైల్వే స్టేషన్‌ ‌కార్గో మూమెంట్‌, ఆక్వా హబ్‌లతో అనుసంధానం చేయాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైల్వే అలైన్‌మెంట్‌లో యుటిలిటీ షిప్టింగ్‌లను సంబంధిత ప్రభుత్వశాఖ అధికారులు జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు.

Leave a Reply