Take a fresh look at your lifestyle.

‌ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి

నాగర్‌ ‌కర్నూల్‌, ‌మే 19.ప్రజాతంత్రవిలేకరి: నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాలో కొనసాగుతున్న మూడు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి జిల్లాలో భూసేకరణ ప్రక్రియను వేగవంతంచేయాలని, భూసేకరణకు సంబంధించిన పెండింగ్‌ ‌పనులు సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్‌ ‌శ్రీధర్‌ ఆదేశించారు.మంగళవారం కలెక్టర్‌ ‌క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ ‌హనుమంత్‌ ‌రెడ్డి తో కలిసి సంబంధిత ఆర్డీవోలు అధికారులతో కలెక్టర్‌ ‌శ్రీధర్‌ ‌సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాలో 11,867.67 ఎకరాల భూమి కావలసి ఉండగా ఇప్పటివరకు 10,960.64 ఎకరాల భూమిని ప్రాజెక్టు పనులకు ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని,ఇంకా మిగిలిన 907.03 ఎకరాల భూసేకరణ జరగాలని అందుకు కావలసిన ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ‌సంబంధించిన ఆర్డీవో లను ఆదేశించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధిం చి 21,342.75 ఎకరాల భూమి అవసరం ఉండగా ఇప్పటివరకు 20,134.77 ఎకరాల భూసేకరణ నిర్వహించి ప్రభుత్వానికి ప్రాజెక్టు పనులు కొనసాగించేందుకు అప్పగిం చడం జరిగింది అన్నారు. ఇంకా 1,208.48 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.డిండి ఎత్తిపోతల పథకానికి నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాలో 994.12 ఎకరాల భూమి అవసరం ఉండగా ఇప్పటివరకు 692.22 ఎకరాల భూసేకరణ నిర్వహించి ప్రాజెక్టు పనులకు ప్రభుత్వానికి అందజేయ డం జరిగిందని, ఇంకా 301.30 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందని, జిల్లాలో కొనసాగుతున్న 3 సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా 100శాతం భూ సేకరణ నిర్వహించాలని సూచించారు.

భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుం డా ఉండేందుకు, ఆర్డీవోలు సంబంధిత తహ సీల్దార్‌ ‌లతో సమీక్షలు నిర్వహించి త్వరగా పూర్తయ్యేలా మిగిలిన భూసేకరణను కొన సాగించాలని ఆదేశించారు.సాగునీటి ప్రాజె క్టుల కోసం రైతుల నుంచి సేకరించిన భూ ములకు ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం రిహాబిలిటేషన్‌ అం‌డ్‌ ‌రీ సెటిల్‌మెంట్‌ (ఆర్‌అం‌డ్‌ఆర్‌) ‌ప్యాకేజీ అమలుకు వారం లోగా ప్రభుత్వం నివేదికలు పంపించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.భూ సేకరణ పూర్తి అయినా వారికి ప్రభుత్వం నుండి నిధులు విడుదల అయిన వారి రైతుబంధు పథకం నుండి అట్టి ఎకరాల భూమిని ఆన్‌ ‌లైన్‌ ‌నుండి తొలగించాలని కలెక్టర్‌ ‌సంబంధిత ఆర్డిఓ లను ఆదేశించారు.మూడు ప్రాజెక్టుల భూసేకరణ పూర్తయ్యేవరకు ఇకపై ప్రతి వారం భూసేకరణపై సమావేశం నిర్వహించనున్నట్లు, అందుకు తగ్గట్లు భూ సేకరణ జరగాలని కలెక్టర్‌ ‌శ్రీధర్‌ అధికారుల కు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌ ‌నాయక్‌, ‌నాలుగు డివిజన్ల ఆర్డీవో లు నాగలక్ష్మి, శ్రీ రాములు, పాండు నాయక్‌, ‌రాజేష్‌ ‌కుమార్‌, ఇతర భూసేకరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply