కోహె డ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తు న్న ఎల్. లక్ష్మణ్, మేడారం జాతర బందోబస్తుకు వెళ్లగా అక్కడ విధి నిర్వహణలో ఉండగా రోడ్డుపై రెండు స్మార్ట్ సెల్ఫోన్లు లభ్యం కాగా వాటి ని తిరిగి వాళ్ళకే ఇచ్చి ఉదారతను చాటుకున్నాడు. మంగళవారం సదరు ఫోన్లకు చార్జింగ్ పెట్టి ఫోన్లు ఆన్ చేయగా మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన విజయ్ కుమార్, శ్యామల, ఫోన్ చేసి ఈ ఫోన్లు మావేనని తెలుపగా కోహెడ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాయని పీసీ సమాచారం ఇచ్చారు. దీంతో సదరు ఇద్దరు ఠాణాకు రాగా పోగొట్టుకున్న రెండు స్మార్ట్ సెల్ ఫోన్లను వారిద్దరికి అందజేశారు. నిజాయితీ చాటుకున్న కానిస్టేబుల్‌ను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
Tags: Lakshman,true constable,Medaram