Take a fresh look at your lifestyle.

లక్క ఇల్లు

బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి

ధృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజపీఠం మీద కూర్చోబెట్టాడు. ధర్మరాజు సద్గుణ సంపన్నుడిగా, దయార్ద్రహృదయుడిగా, ధైర్యస్థైర్య సమన్వితుడిగా ప్రజాభిమానం చూరగొన్నాడు. తన తండ్రి పాండురాజుకన్నా పరిపాలనలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అర్జునుడు తూర్పు, దక్షిణ ప్రాంతాలపై విజయ యాత్ర సాగించాడు. ఆనాటికానాటికి పాండవుల కీర్తి అంతటా వ్యాపించడం ధృతరాష్ట్రునికి  చింతన గలిగించింది. ధ్రుతరాష్ట్రుడు తన మంత్రులలో కూట నీతి తెల్సిన వారిని  ఏకాంతంగా కలిసి తన బాధను తెలియజేశాడు. కణికుడనే వాడు ఇలా చెప్పాడు. ఏ శత్రువునైనా నాశనం గావించాలంటే ముందు వారి ఉత్సాహాన్నీ, ఐశ్వర్యాన్నీ, మంత్రాంగాలనూ నాశనం చేయాలి. తర్వాత అమాత్య, దుర్గ, కోశ, సేనా, రాష్ట్రాలను నాశనం  గావించాలి.  సామ, దాన, భేద, దండ, ఉద్బంధన, విషప్రయోగ, అగ్ని ప్రసరణ మార్గాల ద్వారా నాశనం చేసిన అనంతరం, ఆశ్రయ వర్గాన్ని నాశనం గావించాలి. పిరికి పందలను భయపెట్టి లోభికి ధనమిచ్చి, పరాక్రమంతో బలహీనులనూ స్వాధీనం చేసుకోవాలి. మోసంతో గానీ, విషప్రయోగం ద్వారాగానీ శత్రువును కడతేర్చాల్సి ఉంటుంది. ఇది నీతి శాస్త్రంలో ఉన్న విషయాలు అంటూ కణికుడు ధృతరాష్ట్రునికి ఇంకా ఇలా వివరించాడు.

కోపం పనికిరాదు. శత్రువుతో చిరునవ్వుతోనే ప్రసంగించాలి. వారికి మనపై విశ్వాసం కలిగేలా ప్రవర్తిస్తూ, కాటు వేయాలి. ఎలాంటి సంఘట జరిగినా, చిరునవ్వుతో ఉండాలి. మృదు  భాషణంతో ఎలాంటి ఘాతుకాన్నైనా, సమయం చూసి నెరవేర్చుకోవాలి. కష్ట పడేవానికే సుఖం లభిస్తుంది. ఆశలు రేకెత్తించాలి కానీ అవి నెరవేర్చకుండా వాయిదాలు వేయాలి’ అంటూ కణికుడు చెప్పాడు. ఆ తర్వాత దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి వద్దకు వచ్చి, రాజ్యాంలో ప్రజలకు పాండవులంటే బాగా అభిమానం పెరిగిపోతున్నది. మీ అంధత్వం కారణంగా రాజ్యాధికారం లేకుండా పోయింది. ధర్మరాజు నేడు యువరాజు. రేపు రాజుకాగానే మేమంతా వారి ఆదారాభిమానాల కోసం ఎదురుచుడాలి. ఆ తర్వాత మా పిల్లలు కూడా అలాగే ఆధారపడాల్సి వస్తుంది.
(మిగతా..వొచ్చేవారం)

Leave a Reply