Take a fresh look at your lifestyle.

లఖింపూర్‌ ‌ఖేరి ఘటనపై.. సుప్రీమ్‌ ‌కోర్టు సిట్టింగ్‌ ‌జడ్జిలచే విచారణ జరిపించండి

  • నిష్పాక్షిక విచారణ జరుగడానికి కేంద్ర మంత్రిని వెంటనే తొలగించండి
  • లేకుంటే రైతులందరి గొంతు అణచి వేయబడుతుంది
  • రాహుల్‌ ‌నేతృత్వంలో రాష్ట్రపతికి కాంగ్రెస్‌ ‌ప్రతినిధుల బృందం మెమోరాండం

లఖింపూర్‌ ‌ఖేరీ హింసాకాండపై హోమ్‌ ‌శాఖ సహాయ మంత్రి అజయ్‌ ‌కుమార్‌ ‌మిశ్రాను తక్షణమే తొలగించాలని, ఇద్దరు సిట్టింగ్‌ ‌జడ్జిలచే నిష్పాక్షిక న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ ‌చేస్తూ కాంగ్రెస్‌ ‌పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీతో సహా కాంగ్రెస్‌ ‌నాయకుల బృందం బుధవారం రాష్ట్రపతి రామ్‌ ‌నాథ్‌ ‌కోవింద్‌ను కలిసి ఘటన గురించి వాస్తవాలను వివరిస్తూ మెమోరాండం సమర్పించింది. అక్టోబర్‌ 3‌న జరిగిన హింసలో చనిపోయిన ఎనిమిది మందిలో నలుగురు రైతులు ఉన్నారు. హింసాకాండలో నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు కేంద్ర సహాయ మంత్రి అజయ్‌ ‌కుమార్‌ ‌మిశ్రా రాజీనామా చేయాలని తాము రాష్ట్రపతికి తెలియజేసినట్లు విలేఖరులతో మాట్లాడుతూ రాహుల్‌ ‌గాంధీ అన్నారు. హింసకు సంబంధించి ఆశిష్‌ ‌మిశ్రాను ఉత్తరప్రదేశ్‌ ‌పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అయితే మరణించిన వారి కుంబాలకు, రైతులకు న్యాయం కోసం, ఇద్దరు సిట్టింగ్‌ ‌సుప్రీమ్‌ ‌కోర్టు న్యాయమూర్తులచే ఈ సంఘటనపై విచారణ జరిపించాలని, హత్యలు చేసిన వారిని శిక్షించాలని రాహుల్‌ ఈ ‌సందర్భంగా డిమాండ్‌ ‌చేశారు.

‘‘ కేంద్ర మంత్రి తొలగించబడే వరకు నిష్పాక్షిక విచారణ జరగదు మరియు న్యాయం జరగదు. దీంతో కేవలం మరణించిన వారి కుటుంబాలే కాకుండా రైతులందరి గొంతు అణచివేయబడుతుంది’’ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్‌ ‌ప్రతినిధి బృందంలో ఎకె ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌, ‌మల్లికార్జున్‌ ‌ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడతానని రాష్ట్రపతి తమకుకు హామీ ఇచ్చారని ప్రియాంక పేర్కొన్నారు. యుపి సహా బిజెపి నాయకుల జోక్యం లేకుండా పరిస్థితి మారే అవకాశం లేదని కాంగ్రెస్‌ ‌తన మెమోరాండంలో పేర్కొంది. సిఎం యోగి ఆదిత్యనాథ్‌, ‌మంత్రి అజయ్‌ ‌మిశ్రా పట్ల రాజీ ప్రకటనలు చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ‘‘అజయ్‌ ‌మిశ్రా పాత్రపై ఇంకా విచారణ జరగలేదు.

అతను పదవిలో కొనసాగుతున్నప్పుడు కూడా ఆ అవకాశం లేదు. ఇంకా, ఏ పోలీసు అధికారి కేంద్ర హోమ్‌ ‌శాక సహాయ మంత్రి కుమారుడిపై న్యాయంగా విచారించడానికి సాహసించగలరు. తండ్రి తన ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుకూలంగా మార్చుకోగలరు. ఈ క్లిష్ట పరిస్థితులలో, మా రాజ్యాంగ సంరక్షకుడిగా, ఈ ప్రభుత్వానికి నైతిక దిక్సూచిగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలోని ఇద్దరు సిట్టింగ్‌ ‌న్యాయమూర్తులతో కూడిన కమిషన్‌ ‌ద్వారా స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించండి ..అని కోరుతున్నాము’’ అని కాంగ్రెస్‌ ‌తన మెమోరాండంలో పేర్కొంది. కోట్లాది మంది భారతీయుల మాదిరిగానే, రాష్ట్రపతి కూడా లఖింపూర్‌ ‌ఖేరి ఘటనలో రైతులు పాశవికంగా హత్య కవింపబడడం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారని కూడా కాంగ్రెస్‌ ‌మెమోరాండం పేర్కొంది. ఈ సంఘటన దేశానికే మచ్చ తెచ్చిందని పేర్కొంది.

Leave a Reply