Take a fresh look at your lifestyle.

లద్దాఖ్ లడాయి ..

“నిజానికి సరిహద్దుల్లో పరిస్థితి ఏప్రిల్ చివరి వారం నుంచే ఉద్రిక్తంగా మారుతూ వస్తోంది. లద్దాఖ్ లోని పాంగాంగ్ సో, సిక్కిం లోని నకులా ప్రాంతాల్లో గత నెల మొదటివారంలోనే రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. పాకిస్థాన్ గూఢచర్యం పైనా, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికల పైనా ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఇంటెలిజెన్స్ వర్గాలు చైనా విషయంలో మాత్రం మౌనం వహించాయా? ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమా లేక ప్రభుత్వ ఉదాసీనతా అన్న చర్చ ఉన్నత స్థాయి వర్గాల్లో వినిపిస్తున్నట్లు రిపోర్ట్స్‌ వస్తున్నాయి.”

rehanaసరిగ్గా ఎనిమిది నెలల కిందట తమిళనాడులోని చారిత్రక పర్యాటక ప్రాంతం మామళ్ళపురంలో భారత ప్రధాని నరేంద్ర మోది, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ అలా సముద్రం వడ్డున సేద తీరుతూ కబుర్లు చెప్పుకున్న దృశ్యం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఇటువంటి అనధికార సమావేశాలతో రెండు దేశాల మధ్య స్నేహం మరింత పెనవేసుకుంటుందని నమ్మటాన్ని తప్పుపట్టల్సిన అవసరం కూడా లేదు. కాని, గత కోద్ది రోజుల నుంచి తూర్పు లద్దాక్‌లో భారత-చైనా సరిహద్దు వివాదం మరింత ముదురుతోంది. ఏకంగా 20 మంది భారత జవాన్లను చైనా సైన్యం పోట్టన పెట్టుకోవటంతో యావత్‌ భారతావనిలో ఆందోళన మోదలయ్యింది. అందులోను తెలంగాణా ముద్దు బిడ్డ కల్నల్‌ సంతోష్‌ బాబు ఉండటం తెలుగు ప్రజానీకానికి తీరని ఆవేదన కలిగిస్తోంది. అసలు సరిహద్దున ఏం జరుగుతోంది? చైనా మన భూభాగంలోకి చోరబడిందా? మన జవాన్లు ఎంత ధాటిగా జవాబు ఇచ్చారు? అసలు ఈ చోరబాట్లు, ఘర్షణలకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? నేపాల్‌ రాజ్యాంగ సవరణకు దీనికి ఏమైనా అంతర్గత సంబంధం ఉందా? కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటోంది? ఈ ప్రశ్నలు అందరిలోనూ రేగుతున్నాయి.

అసలు ఏం జరిగింది?
దాదాపు నెల రోజులకు పైగా తరచూ మీడియా కథనాలు వస్తూనే ఉన్నాయి. లద్దాక్‌ సరిహద్దుల్లో భారత-చైనా బలగాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని, మన భూభాగంలోకి చైనా సైన్యం జోరబడిందని, శాటిలైట్‌ చిత్రాలు , ఇరు దేశాల అధికారులు సమావేశమై ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నం, భారత ఆర్మీ చీఫ్‌ ఇరు దేశాలు వక అంగీకారానికి వచ్చాయి…తమ సైన్యాన్ని వెనక్కి రప్పిస్తున్నాయి అని అధికారికంగా ప్రకటించటం…ఇలా ఈ చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇతమిద్దంగా కేంద్రం దీని పై స్పష్టమైన ప్రకటన ఏదీ విడుదల చేయలేదు. తాజాగా పరిస్థితులు మరింత క్షీణించాయి. లద్దాక్‌లోని గాల్వన్‌ లోయ దగ్గర ఉన్న వాస్తవాధీన రేఖ దగ్గర రెండు దేశాల సైనికుల మధ్య బాహాబాహి జరిగింది. రాళ్ళు రువ్వుకోవటం, ముఖాముఖి పోరాటమే జరిగింది… ఎవరూ కాల్పులకు పాల్పడలేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇరు పక్షాల్లోనూ ప్రాణ నష్టం జరిగిందని కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటించారు. భారత సైనికులు 20 మంది వీరమరణం పోందితే, అటు 43 మంది చైనా జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారని మీడియా రిపోర్ట్స్‌ వస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏ దేశం వాస్తవాధీన రేఖ దాటి ముందుకు వచ్చిందన్న విషయాన్ని మాత్రం రెండు దేశాలు ఒకరి పై ఒకరు ఆరోపణలు నెట్టుకుంటున్నాయి. ఇది సహజంగా జరిగేదే.

రాజకీయ-ఆర్ధిక కారణాలు:
భారత-చైనా దేశాల మధ్య సుమారు 3,440 కి.మీ. పోడవున సరిహద్దు రేఖ ఉంది. దీనిలో చాలా చోట్ల మనకు ఆ దేశంతో సరిహద్దు వివాదాలున్నాయి. వీటిలో పశ్చిమ సెక్టార్‌గా పరిగణించే ప్రాంతం లద్దాఖ్‌ సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ సరిహద్దు ఎక్కువ ఉద్రిక్తంగా, చోరబాట్లకు అడ్డాగా ఉంటుంది. అటు అక్సాయ్ చిన్‌ కూడా రెండు దేశాలకు మధ్య వివాదాస్పద ప్రాంతమే. ప్రస్తుతం అక్సాయ్‌ చిన్‌ చైనా నియంత్రణ‌లోనే ఉన్నా మనం దీన్ని మన భూభాగంగా పరిగణిస్తాం. 2017లోనూ డోక్లాంలో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులే ఏర్పడ్డాయి. తాజాగా చైనా వివాదాస్పద గాల్వన్‌ ప్రాంతంలో తమ బలగాలను ఎక్కువగా మోహరించటం, చోరబాటుకు ప్రయత్నించటంతో వివాదం మోదలయ్యింది. నిజానికి సరిహద్దుల్లో పరిస్థితి ఏప్రిల్ చివరి వారం నుంచే ఉద్రిక్తంగా మారుతూ వస్తోంది. లద్దాఖ్ లోని పాంగాంగ్ సో, సిక్కిం లోని నకులా ప్రాంతాల్లో గత నెల మొదటివారంలోనే రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. పాకిస్థాన్ గూఢచర్యం పైనా, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికల పైనా ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఇంటెలిజెన్స్ వర్గాలు చైనా విషయంలో మాత్రం మౌనం వహించాయా? ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమా లేక ప్రభుత్వ ఉదాసీనతా అన్న చర్చ ఉన్నత స్థాయి వర్గాల్లో వినిపిస్తున్నట్లు రిపోర్ట్స్‌ వస్తున్నాయి.

సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పన వైపు భారత్‌ 2008 నుండి దృష్టి సారిస్తోంది. ఈ విషయంలో చైనా ఇప్పటికే మన కంటే బలంగా ఉంది. మన కంటే తక్కువ సమయంలో ఎక్కువ సైన్యాన్ని సరిహద్దుల్లో మోహరించగలిగే మౌలిక సదుపాయాలను ఆ దేశం ఏర్పాటు చేసుకుంది. పాంగాంగ్ సో సరస్సు వద్ద మన దేశం రోడ్డు నిర్మాణానికి పూనుకుంది. అలాగే డార్బుక్-షేక్ దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్డును కలిపే మరో రోడ్డును కూడా చేపట్టింది. డ్రాగన్‌కు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు చైనా దూకుడుకు, భారత ఆచితూచి సమాధానం ఇవ్వడం వెనుక ఆర్ధిక కారణాలు కూడా ఉన్నాయి. కరోనా మహమ్మారి పుట్టింది చైనాలోనే కావటంతో ప్రపంచంలోని అన్ని దేశాలు ఆ దేశాన్ని దోషిగా చూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏకంగా చైనా వైరస్‌ అనే పేరు పెట్టారు. అంతే కాకుండా వైరస్ పుట్టుక వెనుక ఆ దేశ పాత్ర పై విచారణ చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్ళుతున్నాయి. పెట్టుబడులకు 130 కోట్ల జనాభా ఉన్న భారత దేశం సహజంగానే ఆకర్షణీయ ప్రత్యామ్నాయం కాగలదు. కారణాలు, నేపథ్యాలు ఏవైనా దేశ సార్వభౌమత్వ విషయంలో ప్రత్యర్థికి గట్టి సమాధానం ఇవ్వాల్సిందే. మెతక వైఖరి పనికి రాదు.

Leave a Reply