- మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి కనిపించిన
- ఎవరికి వారే యమున తీరే ల వ్యవహరించిన నేతలు
- సమన్వయ లోపం వల్ల చేజారిన మున్సిపల్ చైర్మన్లు
ప్రజాతంత్ర ,హైదరాబాద్ :తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి మున్సిపల్ ఎన్నికల సంధర్బంగా సమన్వయ లోపం కొట్టొచ్చిన్నట్లు కనిపించింది. కాంగ్రెస్ పార్టీ లో సమన్వయ లోపం సర్వసాధారణం కానీ ఈసారి దాని వల్ల పార్టీ మున్సిపల్ హొచైర్మన్ సీట్లను కోల్పోవాల్సి వచ్చింది.ఈ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ సుమారు 19 లేదా 20 చైర్మన్ స్థానాల్లో చాలా గట్టిపోటీనిచ్చింది స్థానిక నాయకత్వం ,రాష్ట్ర నాయకత్వం కొంత ఆ స్థానాల పై దృష్టి సారించి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగి ఉండేది.పార్టీ గట్టి పోటీ ఇచ్చిన స్థానాల్లో ఇండిపెండెంట్ లను ,బీజేపీ ,సీపీఐ ,ఎం,టీఆరెస్ పార్టీ లో పదవులు ఆశించి అసంతృప్తి గా ఉన్న నేతలతో సంప్రదింపులు జరిపి ఉంటే కనీసం 9 నుండి 12 హొమున్సిపల్ చైర్మన్ స్థానాలు కైవసం చేసుకునేదాని అంచనా..అధిబాట్ల లో ఎనిమిది, జనగంలో 10 ,నల్గొండలో హొ20 ,చౌటుప్పల్ , ధర్మపురి,హాలియ, హొనారాయణఖేడ్, భువనగిరి ,నెరేడుచెర్ల లో హొమెజారిటీ సీట్లు ఉన్నపటికీ స్వసంత్రులతో సంప్రదింపులు జరపకుండా చేజార్చుకుంది.ఉత్తమ్ కేవలం నెరేడుచెర్ల మీదే పూర్తి స్థాయి ప్రయత్నాలు చేసి మిగితా మున్సిపాలిటీలను వదిలేసిన్నట్లు కనిపించింది .
ఎక్సఆఫీసీయో మెంబెర్స్ విషయంలో అధికార టీఆరెస్ పార్టీ కొంత అటూఇటూ గా చేసిన కాంగ్రెస్ కూడా ముందస్తు గా ఎక్సఆఫీసీయో మెంబెర్స్ విషయంలో జాగ్రర్త తీసుకుంటే సరిపోయేదని కొందరి వాదన..మణికొండ మున్సిపాలిటీ లో బీజేపీ ,కాంగ్రెస్ పొత్తు చైర్మన్ పదవి కైవసం చేసుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇండిపెండేట్ లను,ఇతర పార్టీ నేతలను కలుపుకొని పోయుంటే బాగుండేదని అభిప్రాయం..ఐతే పార్టీ లో సీనియర్ ల మధ్య సమన్వయం ,ముందస్తు వ్యూహం లేకపోకడం వల్లే ఇలా జరిగిందని , ఎన్నికల ఫలితాలు వచ్చే ముందే పార్టీ ఎక్కడైతే గట్టిగా పోటీ ఇస్తుందని భావించరో ఆ స్థానాల్లో గెలుపు ఎన్ని సీట్లు కావాలి ఆ సంఖ్య రాకపోతే ఇండిపెండెంట్ లను ,టీఆరెస్ మినిహ ఇతర పార్టీ నేతలతో ముందస్తు సంప్రదింపులు , క్యాంపులు నిర్వహించి ఉంటే కచ్చితంగా చైర్మన్ పదవులు వచ్చేవాని పార్టీ క్యాడర్ జోష్ రానున్న రోజుల్లో పార్టీ పై మరింత విశ్వాసం పెరిగేదని కానీ కేవలం పార్టీ లోని సీనియర్ నేతల మధ్య సమన్వయం లేకపోవడం ,స్థానిక ,రాష్ట్ర నాయకత్వ లోపం వల్లేనని పార్టీ లో ,అలాగే విశ్లేషకుల అభిప్రాయం .ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పార్టీ లోని సీనియర్ నేతలు రానున్న పరిస్థితులను ముందుగానే పసిగట్టి సమన్వయం తో నడుచుకోకపోతే భవిష్యతులో కుడా ఇలాంటి ఫలితాలే పునరావృతమౌతాయని కొందరి అభిప్రాయం.
Tags: Exofficio members,Independents, BJP, CPI, M, Trs Party