Take a fresh look at your lifestyle.

వేతనాలు పెంచమంటే అరెస్టులా కెవిపిఎస్‌ ‌జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌

‌తెలకపల్లి : ఆశా కార్యకర్తలు తమకు నెలకు పదివేల రూపాయలు పెంచాలంటూ గురువారం కమిషనర్‌ ‌కార్యాలయం ముందు ధర్నాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ముందే పోలీసులతో 35 మంది ఆశా కార్యకర్తలను తమ ఇళ్ల వద్ద అరెస్టు చేయించడం హేయమైన చర్య అని కెవిపిఎస్‌ ‌జిల్లా కార్యదర్శి జీ లక్ష్మణ్‌ ‌విమర్శించారు ప్రభుత్వం ఆశ కార్యకర్తల పట్ల నిరంకుశ ధోరణి ప్రవర్తిస్తుందని మహిళా పోలీసులతో కాకుండా ఆశా కార్యకర్తలను పురుష పోలీసులతో వాహనాలలో పోలీస్‌ ‌స్టేషన్కు తరలించి నిర్బంధంగా అరెస్టు చేయడం దారుణమని అన్నారు వెంటనే ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఫిక్సడ్ ‌వేతనం నెలకు పదివేల రూపాయలు చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు ప్రభుత్వ తీరుకు నిరసనగా మండల ఆశా కార్యకర్తలు పోలీస్‌ ‌స్టేషన్లో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పుష్ప, స్వప్న, వరలక్ష్మీ, కళావతి, కురువమ్మ, భారతి, చంద్రకళ, నాయకులు మహేష్‌ ‌జగదీష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Leave a Reply