కుట్ర జరుగుతోంది
విగ్రహమంతెత్తుగా
మరోసారి
కాదు కాదు
మరెప్పటికి నిలువెత్తున ముంచే
మహాగొప్పగా
అచ్చంగా అలాగే
నడిబొడ్డున కదలకుండా
బందించే కుట్ర
ఓట్లపండగొస్తుంటే
ఒక్కోరు ఒకలా
బురదజల్లుకుంటుంటే
మహానుబావుడి ఆశయాలను పాతేసేందుకు
ప్రతిచిలుక కాకి పలుకులే పలుకుతుంది
మీరెపుడు బానిసలేనంటూ
మెతుకులెదజల్లుతాం
పాదక్రాంతులవ్వండంటూ
పాతపాటే పాడుతుంటే
మనపాట మనమే పాడాల్సిన తరుణమిదే
ఆకాశమంత ఆశయాన్ని మదినింపుకోవాలి
బహుజనులంతా రాజ్యాధికారంకోసం ఏకమౌదాం
అధికారాన్ని చేపట్టేందుకు మనచేతికిచ్చిన వజ్రాయుధాన్ని వాడుకుని
రాజులై ఏలుదాం
అగ్రవర్ణాల పెత్తనాన్ని పెకిలిద్దాం
– సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.