Take a fresh look at your lifestyle.

బడ్జెట్‌పై కేటీఆర్‌ ‌విమర్శలు అవగాహనా రాహిత్యానికి నిదర్శనం: డా.కె.లక్ష్మణ్‌

Ts BJP President, K laskhman, meets Venkaiah Naidu, delhi, k kesavarao

బడ్జెట్‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ‌చేసిన విమర్శలు ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ అన్నారు. బడ్జెట్‌ ఎలా ఉంటుందో అతనికి తెలియకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చ•సిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూపీఏ హయాంలో కేసీఆర్‌ ‌మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్‌ ‌విసిరారు. టీమిండియా స్ఫూర్తితో ప్రధాని మోడీ రాష్ట్రానికి ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ కేటీఆర్‌ ‌గజినీలా మారి కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను మరచిపోతున్నారని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ‌దేశ ఆర్థిక మూలాలను పటిష్టం చేసేలా ద్రవ్యోల్బణం అదుపు చేసేలా అట్టడుగు వర్గాల ఆర్థిక స్వావలంబనకు దోహదం చేసేలా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను మధ్యతరగతితో పాటు సర్వత్రా స్వాగతిస్తుంటే మంత్రి కేటీఆర్‌ ‌మాత్రం బడ్జెట్‌లో తెలంగాణకు ఒరిగిందేమీ లేదంటూ కూనిరాగాలు తీస్తున్నారని ఎద్దేవా చేశారు.

వివిధ మంత్రిత్వ శాఖలు రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలుచేసే పథకాలు ఆయా రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకే అన్న కనీస స్ప•హ కూడా కేటీఆర్‌కు లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కేటీఆర్‌ ‌జేబులు నింపేందుకో లేక ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు నొక్కేందుకో బడ్జెట్‌ ఉం‌డదన్న విషయాన్ని ఆయన గ్రహిస్తే మంచిదని హితవు పలికారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ అనాలోచిత, అసంబద్ధ విధానాలు, ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారితే కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌కేంద్రంపై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సొమ్మొకడిది సోకొకడిది అన్న చంద్రంగా కేంద్ర పథకాలకు గులాబీ రంగు పులిమి తమ పథకాలుగా టీఆర్‌ఎస్‌ ‌నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారనీ, రూపాయికి కిలో బియ్యంలో కేంద్రం వాటా రూ. 28 అయితే, రాష్ట్ర ప్రభుత్వ వాటా కేవలం రూ. 2 మాత్రమేనన్న విషయాన్ని కేటీఆర్‌ ‌గుర్తించాలని ఈ సందర్భంగా లక్ష్మణ్‌ ‌సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply