
దావోస్ పర్యటన ముగించుకుని నగరానికి ..
తెలంగాణ భవన్లో శనివారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్సీలు, ఎంపీలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భేటీకానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో ఓట్లపై చర్చించనున్నారు. అవసరం ఉన్న చోట ఎక్స్ఫీషియో ఓట్లను టీఆర్ఎస్ వాడుకోనుంది. టీఆర్ఎస్కు ఆరుగురు రాజ్యసభ సభ్యులు, 9 మంది ఎంపీలు, 32 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ మేరకు వారితో చర్చించనున్నారు. ఇదిలావుంటే మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది. నాలుగు రోజుల పాటు కేటీఆర్ దావోస్‌లో పర్యటించారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. పర్యటన ముగించుకుని ఆయన హైదరాబాద్‌కు బయల్దేరారు.వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు
2020లో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన కేటీఆర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా అనేక ప్రముఖ కంపెనీల సీనియర్ ప్రతినిధులతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన మంత్రులను కలిశారు. తెలంగాణ రాష్టాన్రికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో జరిగిన దావోస్ పర్యటన విజయవంతమైంది.గత నాలుగు రోజులుగా దావోస్‌లో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా పర్యటించారు మంత్రి కేటీఆర్.
2020లో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన కేటీఆర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా అనేక ప్రముఖ కంపెనీల సీనియర్ ప్రతినిధులతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన మంత్రులను కలిశారు. తెలంగాణ రాష్టాన్రికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో జరిగిన దావోస్ పర్యటన విజయవంతమైంది.గత నాలుగు రోజులుగా దావోస్‌లో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా పర్యటించారు మంత్రి కేటీఆర్.
ఈ పర్యటనలో సుమారు 50కి పైగా ముఖాముఖి సమావేశాలతో పాటు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ఐదు చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత నాలుగు రోజులుగా మంత్రి ఆల్ఫాబెట్ మరియు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, కోక-కోల సీఈవో జేమ్స్ క్వేన్సీ, సేల్స్ ఫోర్స్ స్థాపకుడు చైర్మన్ మార్క్ బెనియాఫ్, యూట్యూబ్ సీఈవో సుసాన్ వోజ్సికి లాంటి కార్పొరేట్ దిగ్గజాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రగతిశీల విధానాలతో పాటు ఇండస్టియ్రల్ పాలసీని, స్థానికంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను, వివిధ పరిశ్రమలకు ఇక్కడ అందుబాటులో ఉన్న వనరులను పరిచయం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో అగ్రస్థానంలో నిలుస్తున్న అంశాన్ని కూడా ప్రస్తావించారు.
గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరుని మంత్రి కేటీఆర్.. వివిధ దేశాల ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్ నగరం యెక్క కాస్మోపాలిటన్ కల్చర్‌ను మరియు గత కొన్ని సంవత్సరాలుగా జీవించేందుకు అనువుగా ఉన్న నగరాల్లో అత్యుత్తమ నగరంగా ఎంపిక అవుతున్న విషయాన్ని కూడా వివరించారు. దావోస్ పర్యటన ద్వారా పిరమల్ గ్రూప్‌కు సంబంధించిన రూ. 500కోట్ల పెట్టుబడితో పాటు అనేక ఇతర కంపెనీలు తెలంగాణ పట్ల ఆసక్తి వ్యక్తం చేసేలా? మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన సక్సెస్ అయ్యింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా? దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశం నుంచి మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి ఇతర రాష్టాల్రు కూడా పాల్గొన్నప్పటికీ తెలంగాణ భారీ ఎత్తున సొంత రాష్టాన్రికి పెట్టుబడులు తీసుకురాగలిగింది. మంత్రి కేటీఆర్ ప్రతినిధి బృందంలో? ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, డిజిటల్ డియా డైరెక్టర్ దిలీప్ కొనతం, టీ.హబ్ సీఈవో రవి నారాయన్ ఉన్నారు.