Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ అభివృద్దికి తగ్గట్లుగా మౌలిక వసతులు

  • జూబ్లీహిల్‌లో లింక్‌ ‌రోడ్డును ప్రారంభించిన మంత్రి కెటిఆర్
  • 137 ‌లింక్‌ ‌రోడ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి

బాగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ ‌నగరంలో అందుకు తగ్గట్లుగా మౌలిక వసతులను కూడా కల్పిస్తున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.గతంలో ఎప్పుడూ లేనంతగా హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ ఆకర్షణీయమైన నగరంగా ఎదుగుతుందని తెలిపారు. జనాభా పెరుగుదల లాగానే మౌలిక వసతులను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ట్రాఫిక్‌ ‌సమస్యలు తీర్చడం కోసం హైదరాబాద్‌ ‌మాస్టర్‌ ‌ప్లాన్స్ అన్నింటిని పరిశీలించిడం జరిగిందని మంత్రి చెప్పారు.

కీప్రాంతాలను కలిపే లింక్‌ ‌రోడ్లు ఇంతవరకు లేవని…ఆ ప్రధాన రహదారుల వొత్తిడి తగ్గించేందుకు లింక్‌ ‌రోడ్లు దోహదపడతాయని పేర్కొన్నారు. సోమవారం మూడు రోడ్లను ఆయన ప్రారంభించారు. ఇంకా 35 రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగంగా మొత్తం 137 లింక్‌ ‌రోడ్లను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. మొదటిదశలో 35 లింక్‌ ‌రోడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ రోడ్ల నిర్మాణానికి రూ. 313కోట్ల 65 లక్షలు మంజూరు చేసి ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. మరో 100 లింక్‌ ‌రోడ్లను అభివృద్ధి చేయబోతున్నామని స్పష్టం చేశారు. మొత్తంగా 137 లింక్‌ ‌రోడ్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ‌ప్రకటించారు. దశల వారీగా అందుబాటులో తీసుకోస్తామన్నారు.

Leave a Reply