Take a fresh look at your lifestyle.

కేటీఆర్‌ ‌తన రాజకీయ నిజాయితీ నిరూపించుకోవాలి

మంత్రి కేటీఆర్‌ ‌తన రాజకీయ నిజాయితీని నిరూపించుకోవాలని కాంగ్రెస్‌ ఎం‌పీ రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ ‌చేశారు.జన్వాడ లో కేటీఆర్‌ ‌నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు .సోమవారం గాంధీభవన్‌ ‌లో ఆయన మీడియా తో మాట్లాడుతూ …. నాకు ఎలాంటి భూములు లేవని కేటీఆర్‌ ‌ట్విట్టర్‌ ‌లో చెప్పారని తెలిపారు.రేవంత్‌ ‌రెడ్డి వల్ల సీఎం కేసీఆర్‌-‌కేటీఆర్‌ ఆస్తులు-ప్రాణాలకు ప్రమాదం ఉందని పోలీసులు నివేదికలు ఇచ్చారని అదే నివేదికలో కేటీఆర్‌ ‌భూములు ఉన్నాయని-కేటీఆర్‌ ‌కుటుంబం నివాసిస్తుందని కోర్టుకు ఇచ్చారని అన్నారు .2019 మార్చ్ 7‌వ తేదీన 301 సర్వే నెంబర్‌ ‌లో రెండు ఎకరాలు కేటీఆర్‌-ఆయన భార్య పేరుమీద భూమి రిజిస్ట్రేషన్‌ అయిందని , 2018 ఎన్నికల అఫిడవిట్‌ ‌లో 2కోట్ల ఆస్తులు జన్వాడ అర్బనా వెంచర్స్ ‌పేరుమీద ఆస్తులు ఉన్నట్లు స్వయంగా కేటీఆర్‌ ‌తెలిపారని గుర్తు చేశారు.కేటీఆర్‌ 301-13 ‌సర్వే నంబర్స్ ‌లలో భూములు లేవన్న కేటీఆర్‌ ‌మాటలు అబద్ధమని విమర్శించారు. నేను ఆరోపణ చేస్తోంది 301 సర్వే నంబర్‌ ఉన్న భూముల గురించని ,కేటీఆర్‌ – ‌బాల్క సుమన్‌ ‌వేరే భూముల గురించి మాట్లాడుతున్నారని తెలిపారు .నా భూమి-నా భావామర్ది భూమిలో ఒక్క ఇంచు నిర్మాణం ఉంటే నేనే కూల్చి వేస్తానని స్పష్టం చేశారు. ఒట్టినాగుల పల్లి లో నాకు 22గుంటలు-నా భావామర్ధికి 20 గుంటలు ఉన్నాయని ,నేను-కేటీఆర్‌ ‌రాష్ట్ర ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్ననని అన్నారు.

కేటీఆర్‌-ఆయన దండు నా అక్రమ నిర్మాణాలు చూపించాలని అన్నారు .1990 లో అక్రమ భూముల విషయంలో భాద్యత వహిస్తూ కోరెను రంగారావు దళిత మున్సిపల్‌ ‌శాఖ మంత్రి తన మంత్రి పదవి కి రాజీనామా చేశారని విచారణలో భూ అక్రమాలకు తనకు ఎలాంటి సంబంధాలు లేవు అని తెలాకా మళ్ళీ మంత్రి పదవి తీసుకున్నారని  గుర్తు చేశారు.రేవంత్‌ ‌రెడ్డి ఆరోపణల్లో ఒక్క శాతం తప్పు ఉన్నా ఏ శిక్షకు అయినా నేను సిద్ధమని అన్నారు .కేసీఆర్‌- ‌కేటీఆర్‌ ‌ని ఎందుకు మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ ‌చేస్తలేరని ప్రశ్నించారు .. కేటీఆర్‌ ‌నిజంగా తెలంగాణ బిడ్డ అయితే బయటకు వచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని  అన్నారు.

ఏడాది పాటు గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌లో ఇంటిపన్ను రద్దు చేయాలి …
ప్రెస్‌ ‌మీట్‌ ‌కంటే ముందు ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి జీహెచ్‌ఎం‌సీ కమీషనర్‌ ‌ను కలిశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి పన్ను కట్టే స్థోమత ప్రస్తుతం లేదని ,ఉన్నత వర్గాల నుంచి వసూలు చేసినా అభ్యంతరం లేదన్నారు.త్వరగా కౌన్సిల్‌ ‌సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయం తీసుకోవాలని అన్నారు .ఆర్థిక పరిస్థితి బాలేదని ఉద్యోగుల జీతాల్లో కోట విధించారు పేద, మధ్యతరగతి వారికి లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో ఆదాయం లేదని  కరెంట్‌ ‌బిల్లుపై ప్రభుత్వ వైఖరి మారాలని ,ట్రేడ్‌ ‌లైన్స్ ‌కమర్షియల్‌ ‌భవనాలకు ఆస్తి పన్ను విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు..

Leave a Reply