Take a fresh look at your lifestyle.

వారం రోజుల్లో జేబీఎస్‌ ‌మెట్రో: మంత్రి కేటీఆర్‌

KTR launches Credo Property show on Friday at Madapur Hitech city

  • ద్వితీయ శ్రేణి నగరాల అభివృద్ధిపై దృష్టి
  • కేసీఆర్‌ ‌దూరదృష్టి ఉన్న నాయకుడు: మంత్రి కేటీఆర్‌

ప్రజాతంత్ర, హైదరాబాద్‌:‌ తెలంగాణలో ద్వితీయ శ్రేణి నగరాల అభివృద్ధిపై దృష్టి పెడతామని ఐటి,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మాదాపూర్‌ ‌హైటెక్స్‌లో శుక్రవారం క్రెడాయ్‌ ‌పాపర్టీ షోను కేటీఆర్‌ ‌ప్రారంభించారు. కేటీఆర్‌ ‌మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌విజన్‌ ఉన్న నాయకుడని కేటీఆర్‌ ‌కొనియాడారు. నిర్మాణ రంగంలో పలు రాష్టాల్ర నుంచి చాలా మంది వలస వచ్చి కూలీలుగా జీవనం సాగిస్తున్నారని, మన ప్రజలు మాత్రం గల్ఫ్ ‌దేశాల్లో తక్కువ జీతాలతో పడరానిపాట్లు పడుతున్నారని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గల్ఫ్ ‌దేశాల్లో పర్యటిస్తారని చెబుతూ.. అక్కడ పని చేసే తెలంగాణ కార్మికులను తీసుకొస్తారని వ్యాఖ్యానించారు. . స్థిరాస్తి వ్యాపారుల సమస్యలను పరిష్కరించామని అన్నారు. స్థిరాస్తి వ్యాపారులు నూతన సాంకేతికతను వినియోగించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో అమలు చేసిన టీఎస్‌ ఐపాస్‌ ‌దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ ‌దనే కాకుండా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల అభివృద్ధిపై కూడా దృష్టిసారించామన్నారు. ఎన్నికలు ముగిశాయి కాబట్టి పాలనపైనే దృష్టి పెడతామన్నారు. నిర్మాణ సంస్థలు హైదరాబాద్‌ ‌దే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి సారించాలని సూచించారు.

పట్టణాలకు పురపాలక శాఖ నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని, మౌలిక వసతులు కల్పించడం ద్వారా అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలో అత్యధిక రద్దీ ఉన్న నగరాల్లో బెంగళూరు తొలిస్థానంలో నిలిచిందని చెబుతూ.. భవిష్యత్‌లో హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.మరో వారం పది రోజుల్లో జేబీఎస్‌ ‌మెట్రో కారిడార్‌ను ప్రారంభిస్తామని కేటీఆర్‌ అన్నారు. మెట్రో రెండోదశ, ఎస్‌ఆర్‌డీపీ పనుల విస్తరణకు ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ ‌పశ్చిమ ప్రాంతానికే కాకుండా నగరంలో నలువైపులా స్థిరాస్తి వ్యాపారం విస్తరించాలని అన్నారు. నార్త్ ‌హైదరాబాద్‌లోని కొంపల్లి పరిసరాల్లో కొత్త ఐటీ పార్కు ఏర్పాటు చేయబోతున్నట్లు కేటీఆర్‌ ‌వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రధాన రహదారుల అభివృద్ధిని 7 ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించామని, రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో అద్భుత రహదారి వ్యవస్థ ఏర్పాటుకానుందని కేటీఆర్‌ అన్నారు. ఏడాదిలోనే టీ-హబ్‌ ‌రెండో దశను ప్రారంభించబోతున్నట్లు కేటీఆర్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌ ఔషధ నగరిని కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తామన్నారు. ఔటర్‌ ‌రింగ్‌రోడ్డు చుట్టూ కొత్తపరిశ్రమలు రాబోతున్నాయని, రాబోయే పది పదిహేను ఏళ్లపాటు హైదరాబాద్‌ ‌వృద్ధి కొనసాగుతుందని కేటీఆర్‌ ‌తెలిపారు.

Tags: second phase of Tea-Hub, ktr, secundrabad metro

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply