Take a fresh look at your lifestyle.

చంద్రబాబు తొత్తు, బినామి

  • పక్క పార్టీ నుంచి దిగుమతయిన వ్యక్తికి పిసిసి అధ్యక్ష పదవి
  • రేవంత్‌పై మండిపడ్డ కెటిఆర్‌
  • ‌కెసిఆర్‌ను విమర్శించే అర్హత రేవంత్‌కు లేదన్న మంత్రి
  • సెప్టెంబర్‌ 2‌న టిఆర్‌ఎస్‌ ‌జెండాపండగ పిర్వహించున్నట్లు వెల్లడి

రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీకి ఎవరూ దిక్కు లేక పక్క పార్టీలో నుంచి ఒకర్ని దిగుమతి చేసుకున్నారు. చంద్రబాబు తొత్తు, బినామిని తీసుకొచ్చి పార్టీకి అధ్యక్షుడిని చేశారు. డబ్బు సంచులతో దొరికిపోయినొన్ని అధ్యక్షుడిని చేశారు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నోరు పారేసుకుంటున్నాడని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మిడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను సాధించిన నాయకుడు, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర గల నాయకుడు, ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్‌.

‌ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి నాయకుడిని పట్టుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన కాలి గోరికి కూడా సరిపోని కొంతమంది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదు.. ప్రతిపక్షాలకు కూడా అలానే బుద్ధి చెప్తాని కేటీఆర్‌ అన్నారు. సహనానికి ఓపిక ఉంటుంది. ఓపికకు కూడా హద్దులుంటాయి. రాజకీయాల్లో సంస్కారవంతంగా మాట్లాడాలని కోరుకుంటారు. కానీ ఆ పరిస్థితి లేదు. తప్పని పరిస్థితుల్లోనే మాట్లాడుతున్నాం. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటే కేంద్ర మంత్రి అని కూడా చూడకుండా లోపల పడేశారు. మరి మేం కూడా చేయమంటారా? అని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు.

సెప్టెంబర్‌ 2‌న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. అదే రోజున ఢిల్లీలో తెలంగాణ భవన్‌ ‌ప్రారంభించే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని చెప్పారు. సెప్టెంబర్‌ ఆఖరులోపు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల నియామకాన్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 150 డివిజన్లకు 150 డివిజన్‌ ‌కమిటీలు ఉంటాయన్నారు. కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 51 శాతం పైగా అవకాశం ఉంటుందని తెలిపారు. మండల, నియోజకవర్గ కమిటీలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply