Take a fresh look at your lifestyle.

కరీంనగర్‌ ఐటిటవర్‌కు 18న కేటీఆర్‌ ‌ప్రారంభోత్సవం

it minister ktr

కరీంనగర్‌లో నిర్మించిన ఐటీ టవర్‌ను ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌ ఈనెల 18న ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ ‌కుమార్‌,‌మంత్రి గంగుల కమలాకర్‌లు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. గతంలో అనివార్య కారణాల వల్ల టవర్‌ ‌ప్రారంభోత్సవం వాయిదా పడింది. కరీంనగర్‌లో జరిగిన డియా సమావేశంలో వీరు వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మిగతా పట్టణాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్ణయించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ ‌కుమార్‌ అన్నారు. త్వరలో కరీంనగర్‌లో ఐటీ టవర్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.

- Advertisement -

కరీంనగర్‌ ‌జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి గంగుల కమలాకర్‌, ‌వినోద్‌ ‌కుమార్‌ ‌డియా సమావేశంలో మాట్లాడారు. స్థానిక యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా అతి తక్కువ వ్యవధిలో నిర్మించిన టవర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించనున్నారని చెప్పారు. తొలుత 12 కంపెనీలతోనే ప్రారంభించాలని భావించామని పేర్కొన్నారు. ఏడాది తర్వాత ఉద్యోగుల సంఖ్య పెంచాలనే నిబంధనతో కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పలువురికి నియామక పత్రాలు కూడా అందజేస్తామని తెలిపారు.

Leave a Reply