Take a fresh look at your lifestyle.

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమస్యే కాదు

చిల్లర పార్టీలు ..చిల్లర రాజకీయాలు
స్థాయిని మరిచి విమర్శలు
పత్రికల్లో హెడ్‌లైన్‌ ‌వార్తల కోసమే
కెసిఆర్‌ ‌భిక్షతోనే రాష్ట్ర నేతలకు పదవులు
70 ఏళ్లలో చేయని అబివృద్ధిని చేసి చూపాం
టిఆర్‌ఎస్‌ ‌విస్తృతస్థాయి సమావేశంలో విపక్షాలపై మండపడ్డ కెటిఆర్‌

రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల తీరుపై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారంతా స్థాయిని మరచి విమర్శలు చేస్తున్నారని, టిఆర్‌ఎస్‌ ‌పురోభివృద్దితో వారు తట్టుకోలేక పోతున్నారని మండిపడ్డారు. మంగళవారం కొంత మంది ఎగిరెగిరి పడుతున్నారు. టీకాంగ్రెస్‌, ‌టీబీజేపీ..కేసీఆర్‌ ‌పెట్టిన భిక్ష కాదా? వి•కు పదవులు వొచ్చాయంటే కేసీఆర్‌ ‌పెట్టిన భిక్ష కాదా? అని కేటీఆర్‌ ‌ప్రశ్నల వర్షం కురిపించారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్‌ ‌పుణ్యమా అని పదవులు రాగానే.. గంజిలో ఈగల్లాగా ఎగిరిపడుతున్నారు అని ఎద్దేవా చేశారు. చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. వయసులో వి• కంటే 20 ఏండ్ల పెద్ద మనిషిని పట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న పుట్టిన చిల్లరగాళ్లు ఎగిరెగిరి పడుతున్నారని ఘాటుగా స్పందించారు. పేరుకే ఢిల్లీ పార్టీలు కానీ..చేసేవి మాత్రం చిల్లర పనులు అని ధ్వజమెత్తారు. ప్రత్యర్థుల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ ‌పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ ‌జలవిహార్‌లో జీహెచ్‌ఎం‌సీకి చెందిన టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులతో కేటీఆర్‌ ‌విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ..పత్రికల్లో హెడ్‌లైన్స్ ‌కోసం, పైశాచిక ఆనందం కోసమే ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారిని ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ‘60 లక్షల పైచిలుకు సభ్యులతో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ బలంగా ఉంది. 33 జిల్లాల్లో జిల్లా పార్టీ కార్యాలయాలు కట్టుకున్నాం. మొన్న ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు భూమిపూజ చేసుకున్నాం. ఇప్పుడు మన ముందు ఏ ఎన్నిక లేదు. హుజూరాబాద్‌ ఎన్నిక సమస్యనే కాదు. ప్రత్యర్థుల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. దాని కోసం సైన్యం ఉంటే సరిపోదు. ఇందుకు ఎక్కడికక్కడ కమిటీలు పటిష్టంగా ఉండాలన్నారు.  జీహెచ్‌ఎం‌సీ పరిధిలోకి వొచ్చే నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి ముందుకెళ్లాలి. గ్రేటర్‌ ‌పరిధిలో 4,800 దాకా కాలనీ అసోసియేషన్‌లు ఉన్నాయి. 1486 నోటిఫైడ్‌ ‌బస్తీలు ఉన్నాయి. మొత్తం కలిపి 6,300 దాకా కాలనీలు, బస్తీలు ఉన్నాయి. డివిజన్లతో పాటు వీటికి కూడా కమిటీలు వేసుకోవాలి. సెప్టెంబర్‌ 29‌వ తేదీ లోపు బస్తీ, కాలనీ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ కమిటీలో 15 మందికి తగ్గకుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. డివిజన్‌ ‌స్థాయిలో 150 డివిజన్‌ ‌కమిటీలు వేసుకోవాలి. ఈసారి జిల్లా కమిటీలు వేసుకోవాలని కేసీఆర్‌ ‌చెప్పారని కేటీఆర్‌ ‌వెల్లడించారు. 70 ఏండ్లలో తెలంగాణ ప్రజలకు కరెంట్‌, ‌తాగునీరు ఇవ్వలేని దౌర్బాగ్యం వి•ది. 24 గంటల కరెంట్‌ ‌తీసుకొచ్చింది కేసీఆర్‌ ‌కాదా? నల్లగొండలో ప్లోరోసిస్‌ ‌లేదని కేంద్రమే పార్లమెంట్‌లో చెప్పింది.. అది తెలంగాణకు గర్వకారణం కాదా? అని కేటీఆర్‌ అడిగారు. తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉంటే.. ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేలితే బరాబర్‌ ‌సమాధానం చప్తాం. కుక్క కాటు చెప్పు దెబ్బ తప్పదు. ఓపిక పట్టినం.. సైలెంట్‌గా ఉండే కొద్ది మాటలు ఎక్కువైతున్నాయని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. గల్లీ టు ఢిల్లీ గులాబీ జెండాకే జైకొడుతున్నారు. 2014లో 63 సీట్లు, ఆ తర్వాత వొచ్చిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 12769 గ్రామ పంచాయతీలకు గానూ..10 వేల గ్రామాల్లో గులాబీ జెండాలు ఎగిరాయి. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లోనూ 32 జడ్పీలను కైవసం చేసుకున్నాం. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించారు. కేసీఆర్‌ ‌నాయకత్వాన్ని బలపరిచారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో 9 సీట్లను కట్టబెట్టారు. 142 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే..135 మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను రెపరెపలాడించారు. ఈ ఏడేండ్లలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన వారిని తప్పకుండా గౌరవించు కుంటామని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. పదవులు రాక కొంత మంది నిరాశతో ఉన్నారు. తొందర్లోనే 500 నామినేటెడ్‌ ‌పోస్టులను భర్తీ చేస్తాం. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో కో ఆప్షన్‌ ‌సభ్యులను నియామకం కూడా పూర్తి చేస్తాం. పార్టీ గౌరవాన్ని పెంచే విధంగా పని చేయాలి. బస్తీ, డివిజన్‌ ‌కమిటీలకు ఇచ్చే ప్రాధాన్యతను సోషల్‌ ‌వి•డియా కమిటీలకు ఇవ్వాలి. సోషల్‌ ‌వి•డియా కమిటీలకు కూడా శిక్షణ ఇవ్వాలి. ఇతర ఏ పార్టీకి లేని విధంగా ఒక కార్యాలయాన్ని నిర్మాణం చేసుకుందామని కేటీఆర్‌ ‌తెలిపారు. దసరా, దీపావళి తర్వాత కమిటీలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, ‌మహ్‌ఊద్‌ అలీ, మల్లారెడ్డి, మేయర్‌ ‌గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply