- 12 శాతం రిజర్వేషన్లను విస్మరించిన కెసిఆర్
- నల్లగొండ ప్రచారంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్
పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మున్సి పాలిటీలను అభివృద్ధి చేయడంలో విఫలమ య్యారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆయన పురపాలక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన డియాతో మాట్లాడుతూ.. యూపిఏ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.12వేల కోట్ల నిధులు మంజూరు చేశామని ఆయన అన్నారు. రాష్ట్రంలో అధికంగా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి సిఎం కెసిఆర్ అన్యాయం చేశారని ఆరోపించారు. ఒక్కరికి కూడా మంత్రి మండలిలో అవకాశం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. గిరిజనులు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగి లేదని ఉత్తమ్ అన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో, ట్రిపుల్ తలాక్, జిఎస్‌టి విషయంలో బిజెపి ప్రభుత్వానికి కెసిఆర్ మద్దతిచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. టిఆర్‌ఎస్‌కు వోటేస్తే అది బిజెపికి వేసినట్లే అని ఆయన అన్నారు. అందరికీ న్యాయం జరిగే పాల కావలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు. ఇదిలావుంటే భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ పుట్టిన తర్వాతే మోసం పుట్టిందని, ఇలాంటి మోసపూరిత ముఖ్యమంత్రిని ఉరితీసినా తప్పు లేదని ధ్వజమెత్తారు. మోసపూరిత వాగ్దానాలతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తే డబ్బా ఇళ్లు అని విమర్శించిన కేసీఆర్.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మాటతప్పారని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాను ఐటీ మం త్రిగా ఉన్నప్పుడు టీసీఎస్, ఏరోస్పేస్, ప్యాబ్‌సిటీ, ఔటర్‌రింగ్ రోడ్డు, జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తే.. ఇప్పటి ప్రభు త్వం ముచ్చర్లలో ఫార్మా సిటీ ఏర్పాటు చేసి ప్ర జల నెత్తిన కాలుష్యం తెచ్చి పెట్టాలని చూస్తోం దని మండిపడ్డారు. ఫార్మా భూము లతో ఐటీ మంత్రి కేటీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, వారి ఆగడాలకు త్వరలోనే అడ్డుకట్ట పడుతుందన్నారు.
Tags: ktr real estate business , CS, Aerospace, Publicity, Outering Road, GMR International Airport