Take a fresh look at your lifestyle.

వరద ప్రాంతాల్లో కెటిఆర్‌ ‌సుడిగాలి పర్యటన

  • బాధితులకు పారమర్శలు..ఆర్థిక సాయం అందచేత
  • సహాయ పునరావస చర్యల పర్యవేక్షణ

‌హైదరాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులతో కలసి కెటిఆర్‌ ‌బాధితులను పరామర్శిస్తూనే..ఆర్థిక సాయాన్ని అందచేస్తున్నారు. మరోవైపు సహాయ కార్యక్రమాలను కూడా ఆయన పర్యవేక్షించారు. వివిధ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేపట్టారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మంత్రులు కేటీఆర్‌, ‌తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌మల్లారెడ్డి విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని వరద బాధిత కుటుంబాలకు మంత్రులు అందజేస్తున్నారు. ఉప్పల్‌ ‌నాలా చెరువు వద్ద చేపట్టిన మరమ్మతులను కేటీఆర్‌ ‌పరిశీలించారు. బోడుప్పల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలో ముంపుకు గురైన ప్రజలను కలిసి, వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10,000 ఆర్ధిక మంత్రులు కేటీఆర్‌, ‌మల్లారెడ్డి అందజేశారు. స్థానిక జిల్లా పరిషత్‌ ‌పాఠశాలలో వరద బాధితులకు ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లను పరిశీలించారు.

Hyderabad are consulting

సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపునకు గురైన బేగంపేటలోని బ్రహ్మణవాడిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌పర్యటించారు. వరద బాధితులకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ ఉప్పల తరుణి, అధికారులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముంపునకు గురైన లాలాపేట్‌లో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్‌ ‌పర్యటించారు. కేటీఆర్‌ ‌వెంట డిప్యూటీ స్పీకర్‌ ‌పద్మారావు గౌడ్‌, ‌స్థానిక కార్పొరేటర్లు ఉన్నారు. వరద ప్రభావానికి గురైన కాలనీల్లో మంత్రి కేటీఆర్‌ ‌పర్యటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందజేశారు. బాధితులందరికీ అండగా ఉంటామని కేటీఆర్‌ ‌భరోసా ఇచ్చారు.

Hyderabad are consulting

జీహెచ్‌ఎం‌సీ పరిధిలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. తొలిరోజు 1036 మందికి రూ. 10వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించినట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ‌తెలిపారు. బాధితులకు నగదు పంపిణీలో మంగళవారం 100 టీంలు పాల్గొన్నాయి. ఒక్కో టీంలో ముగ్గురిని నియమించారు. టీంల సంఖ్యను  బుధవారం నుంచి రెట్టింపు చేసారు. ఈ సంఖ్యను 200లకు పెంచి ఆర్థిక సాయం అందించే పక్రియను మరింత వేగవంతం చేస్తున్నారు. నగదు పంపిణీ కార్యక్రమాన్ని సీఎస్‌ ‌సోమేశ్‌కుమార్‌ ‌దగ్గరుండి పర్యవేక్షించారు. బాధితులకు వీలైనంత త్వరగా సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ఓవైపు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూనే మరోవైపు వరద కట్టడికి, కాలనీలను శుభ్రం చేసే పక్రియను పర్యవేక్షించారు.

Leave a Reply