Take a fresh look at your lifestyle.

వరద సహాయక చర్యలపై కేటీఆర్‌ ‌సమీక్ష

వరద సహాయక చర్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ‌జీహెచ్‌ఎం‌సీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మేడ్చల్‌ ‌జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ జీహెచ్‌ ఎం‌సీలో ప్రస్తుతమున్న అధికారులు, మేయర్‌, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలని సూచించారు.

వరద బాధితులకు ఆహారం, అవసరమైన దుప్పట్లు, వైద్య సదుపాయం కల్పించాలని, క్యాంపుల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యుత్‌ ‌సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. హిమాయత్‌సాగర్‌, ‌హుస్సేన్‌సాగర్‌ ‌నీటి విడుదల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రహదారులపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని, మ్యాన్‌ ‌హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఓపెన్‌ ‌నాలాల వద్ద ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ‌పురపాలకశాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply