Take a fresh look at your lifestyle.

జిల్లా వ్యాప్తంగా కెటిఆర్‌ ‌జన్మదిన వేడుకలు

సిరిసిల్ల, జులై 24,(ప్రజాతంత్ర ప్రతినిధి) : రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కె.తారక రామారావు జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు,ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు.సిరిసిల్ల ,వేములవాడ మున్సిపాలిటీల్లో పాలక వర్గం కేక్‌ ‌కట్‌ ‌చేసి సంబరాలు నిర్వహించి,అన్నదానాలను చేపట్టారు.ఇదే సమయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ‌న్యాలకొండ అరుణ కోనరావుపేట మండలంలోని మర్రిమడ్ల గ్రామంలో హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు.ఈ గ్రామ శివారులోని అటవీప్రాంతంలో అటవీ శాఖ అధ్వర్యంలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టగా జిల్లా అధికారులు సైతం పాల్గొన్నారు.డిఆర్‌డిఏ కౌటిల్య రెడ్డి,డిపిఓ రవీందర్‌,ఎఫ్‌ఆర్‌ఓ ‌వేణుగోపాల్‌ ‌తదితర నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటి అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణభాస్కర్‌ ‌పాల్గొన్నారు.వేములవాడ మున్సిపాలిటిలో చైర్‌పర్సన్‌ ‌రామతీర్థపు మాధవి,వైస్‌ ‌చైర్మన్‌ ‌మధు రాజేందర్‌,‌కౌన్సిలర్లు కేక్‌ ‌కట్‌ ‌చేయగా,టిఆర్‌ఎస్‌ ‌నాయకులంతా రాజన్నగుడికి చేరుకుని కెటిఆర్‌ ‌పేరిట అర్చనలు గావించి,కోడెమొక్కులు చెల్లించిన పిదప ఆలయం ముందు భాగంలో కేక్‌ ‌కట్‌ ‌చేసి పంపిణి చేశారు. ఇదే సమయంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో టిఆర్‌ఎస్‌ ‌నాయకులు కేక్‌ ‌కట్‌ ‌చేయడంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.దీనితో జిల్లా అంతటా సందడిగా మారింది.

Leave a Reply