నెల్లూరు జిల్లాలో ఇస్తున్న ’కృష్ణపట్నం ఆయుర్వేద మందు’ కొరోనాకు బాగా పనిచేస్తోందనే ప్రచారం జరిగింది. దీంతో వేల సంఖ్యలో జనం ఇక్కడకు తరలివచ్చారు.. అయితే శాస్త్రీయంగా రుజువు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని నిలుపుదల చేసింది. పరీక్షల నిమిత్తం ఆయుష్ ల్యాబ్‌కు పంపింది. దీనిపై సోషల్ డియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి కృష్ణపట్నం కొరోనా మందుని పంపిణీ చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రకటించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. కాగా ఆనంద్ ఆయుర్వేద మందు పంపిణీ వద్ద గందరగోళం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
ఒక్కసారిగా వేల మంది రావడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కాకాణి గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కొద్ది మందికి మాత్రమే మందు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ నివేదిక అనంతరం తేదీలని ప్రకటిస్తామని, అప్పటి వరకు పంపిణీని నిలిపేస్తామని చెప్పారు