Take a fresh look at your lifestyle.

ఎపికి న్యాయంగా వచ్చే నీటినే వాడుతున్నాం

  • జీవో 203 అందుకే విడుదల చేశాం
  • ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ ‌కుమార్‌

అమరావతి,మే 13 : ఏపీకి న్యాయంగా వచ్చిన వాటా నీటిని తరలించేందుకు 203 జీవో విడుదల చేశామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ ‌కుమార్‌ ‌మరోమారు స్పష్టం చేశారు.  సముద్రంలో కలిసే నీటినే రాయలసీమ, నెల్లూరు ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. తామేదో తెలంగాణకు అన్యాయం చేస్తున్నట్టుగా కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు నష్టం కలిగించే పని చేయబోమని మంత్రి స్పష్టం చేశారు.

ఏపీకి కేటాయించిన నీటినే వాడుకుంటామని మంత్రి అనిల్‌ ‌చెప్పారు. అయితే ఏపీ వైఖరిపై తెలంగాణ మంత్రి హరీశ్‌ ‌రావు మండిపడ్డారు. ఇది ఏకపక్ష నిర్ణయమని విమర్శించారు. ఏపీకి ఇచ్చిన 512 టీఎంసీల వాటా శాశ్వత కేటాయింపులు కాదని దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. శ్రీశైలం అనేది జాయింట్‌ ‌ప్రాజెక్టని, రెండు రాష్ట్రాలకు హక్కుందని అన్నారు. ఇప్పుడు ఏకపక్షంగా నీళ్లు తీసుకుపోడానికి జీవో ఇవ్వడం సరికాదని అన్నారు.

Leave a Reply