Take a fresh look at your lifestyle.

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు కోవిడ్‌ ‌దెబ్బ

“ట్రేడ్‌ ‌ప్రమోషన్‌ ‌కౌన్సిల్‌ అం‌చనాల ప్రకారం మన దేశం చైనా నుంచి 30 బిలియన్‌ ‌డాలర్ల ఔషధ మూలికాలను ఏడాదికి దిగుమతి చేసుకుంటోంది.. మన దేశానికి చెందిన వ్యవసాయ రసాయన పరిశ్రమ బాగా దెబ్బతింది. చైనా దిగుమతులపై ప్రభావం కారణంగా ఖరీఫ్‌ ‌సీజన్‌లో ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. రంగులు,పిగ్‌ ‌మెంట్సు,మౌలిక రసాయనాలు దిగుమతి చేసే పరిశ్రమలపై కూడా ప్రభావం చూపవచ్చు. టీవీల విడిభాగల్లో 85 శాతం పైగా చైనా నుంచి భారత కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి.”

డౌ జోన్స్ ‌పారిశ్రామిక సగటు 1987 తర్వాత అత్యల్పంగా ట్రేడింగ్‌ ‌జరిగింది. అమెరికా, పలు ఇతర దేశాలు మాంద్యం వైపు అడుగులు వేస్తున్నాయి. కరోనా వైరస్‌ ‌వల్ల ప్రపంచ దేశాలలో ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తే అదే అభిప్రాయం కలుగుతోంది. అమెరికా అధ్యక్షుడు 30 రోజుల ట్రావెల్‌ ‌బ్యాన్‌ను ప్రకటించారు. యూరప్‌ ‌దేశాలు కూడా ఇలాంటి ఆంక్షలే విధించాయి. ఈ దేశాల్లో ఆదాయం అంతా విమానయాన సర్వీసుల ద్వారానే వస్తుంది. కరోనా ప్రభావం కారణంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో విమాన సర్వీసులు 50శాతం పైగా నిలిచిపోయాయియ. ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను వాయిదా వేశారు. కోవిడ్‌ -19 ‌వల్ల త్రైపాక్షికమైన షాక్‌ ‌లను చూస్తున్నాం. చైనాలో పరిశ్రమలు, కార్పొరేట్‌ ‌సంస్థల మూత వల్ల సరఫరాలో షాక్‌ ‌మొదటిది. ప్రజారోగ్య ఎమర్జెన్సీ రెండవది. చమురు సరఫరాలపై కోవిడ్‌-19 ‌ప్రభావం ఎక్కువగా ఉంది.ధరలపై కూడా ప్రభావం ఉంది.

157 దేశాల్లో కరోనా బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అమెరికాలో మొదట్లో ఏమీ కనిపించలేదు.ఇప్పుడు అక్కడ కూడా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో ఇదే పరిస్థితి కొనసాగితే 2008 నాటి ఆర్థిక మాంద్యం పునరావృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్‌ ‌రిజర్వు వడ్డీ రేట్లను తగ్గించింది. ఇతర దేశాల కేంద్ర బ్యాంకులు కూడా వడ్డీ కోతకు సిద్ధమవుతు న్నాయి. ఆర్థిక విధానాలకు ఉద్దీపనలను జోడిస్తున్నారు. కోవిడ్‌ ‌ప్రభావంచో మార్కెట్లు పతనం కాకుండా అన్ని దేశాలు ఉద్దీపనలను ప్రకటిస్తున్నాయి.

భారత్‌ ‌వృద్ధిపై కరోనా ప్రభావం ?
కరోనా ప్రభావం నిక్కచ్చిగా, ఎంత ఎక్కువగా ఉంటుందో అంచనా వేయడం కష్టం సుప్రసిద్ధ మార్కెట్‌ ‌విశ్లేషకులు హూగో ఎర్కెన్‌, ‌రాఫీ హయత్‌, ‌కాన్‌ ‌జీ కరోనా ప్రభావం వల్ల భారత జడిపి తగ్గవచ్చని,ప్రపంచ వ్యాప్తంగా 1.6 శాతం ఉండొచ్చు.అది గత ఒఈసీడి అంచనాలు 2.4 శాతం కన్నా తక్కువ ఉండవచ్చని పేర్కొంది.భారత్‌లో వృద్ధి రేటు గతంలో అంచనా వేసిన 5.7 శాతం కన్నా 5.3 శాతం ఉండవచ్చని వారు వివరించారు. అంతర్జాతీయ వృద్ధిరేటును దృష్టిలో ఉంచుకునే వారు మన వృద్ది రేటు 5.3 శాతం ఉండొచ్చని అంచనా వేశారు. భారత్‌ ‌ప్రాధాన్య రంగాల్లో మార్పు రావచ్చు. ఈ వైరస్‌ ‌వీలైనంత త్వరలో అదుపులోకి వస్తుందో లేదో తెలియదు.దీనిని ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.ఏడాదిలో అదుపులోకి వస్తుందా అంతకుమించి ఎక్కువ కాలం పట్టవచ్చా అనేది వారు అంచనా వేయలేక పోతున్నారు. అమెరికాలోనూ,యూరప్‌ ‌దేశాల్లోని వాణిజ్యాంశాలు, ముఖ్యంగా ఉత్పత్తులపై ప్రభావం ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నారు. దానిని బట్టి మన దేశంలోని కొన్ని రంగాల్లో ఉత్పత్తులపై ప్రభావం ఉండవచ్చు. ఔషధ, వ్యవసాయ రసాయనాలు, ఎలక్ట్రానిక్‌ ‌పరికరాలు, ఆటోమోటీవ్‌ ‌విడిభాగాలు మొదలైన పరిశ్రమలపై చైనాలో కరోనా ప్రభావం ఉండవచ్చు చైనా ముఖ్యమైన వస్తువులు,ఉత్పత్తుల దిగుమతులకూ, ఎగమతులకు మజిలీగా ఉంది. చైనాలో పరిస్థితిని బట్టి ఈ రంగాలపై ప్రభావం ఉంటుంది. 2018లో చైనా 90.4 బిలియన్‌ ‌డాలర్ల విలువైన వస్తువులను మన దేశానికి ఎగుమతి చేసింది. ఎగుమతుల్లో అది 14.63 శాతం. చైనా ఇప్పుడు మధ్యతరహా వస్తువు లకు ప్రధాన కేంద్రం.

ట్రేడ్‌ ‌ప్రమోషన్‌ ‌కౌన్సిల్‌ అం‌చనాల ప్రకారం మన దేశం చైనా నుంచి 30 బిలియన్‌ ‌డాలర్ల ఔషధ మూలికాలను ఏడాదికి దిగుమతి చేసుకుంటోంది.. మన దేశానికి చెందిన వ్యవసాయ రసాయన పరిశ్రమ బాగా దెబ్బతింది. చైనా దిగుమతులపై ప్రభావం కారణంగా ఖరీఫ్‌ ‌సీజన్‌లో ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. రంగులు,పిగ్‌ ‌మెంట్సు,మౌలిక రసాయనాలు దిగుమతి చేసే పరిశ్రమలపై కూడా ప్రభావం చూపవచ్చు. టీవీల విడిభాగల్లో 85 శాతం పైగా చైనా నుంచి భారత కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఆయా కంపెనీల్లో కాంట్రాక్ట్ ‌పద్దతిపై పని చేసే ఉద్యోగుల ఉపాధి దెబ్బతినవచ్చు.ఆహారం,తినుబండారాల సప్లయి యాప్‌లలో పని చేసేవారికి హాని జరగవచ్చు. రెస్టారెంట్లు, బార్‌లు,కేసినోలలో పని చేసేవారి ఉపాధి దెబ్బతినవచ్చు. అమెరికా వంటి దేశాల్లో ఆరోగ్య రక్షణ వ్యయంపై కరోనా ప్రభావం పడవచ్చు.వారు గతంలో కన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అమెరికాలో ఆరోగ్య రక్షణ పథకాల్లో కొన్ని మందులు, పరికరాలు లబ్దిదారులు కొనుగోలు చేయనవసరం లేదు. కానీ, ఇప్పుడు ఖర్చు చేయాల్సి వస్తుంది. కరోనా వ్యాధి అనుమానితుల శిక్షణ కోసం యూకె,ఇటలీ, యూరప్‌లోని ఇతర దేశాలు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి.ఇంట్లో ఖర్చులు,వ్యాపార సంస్థల వ్యయాలు బాగా పెరగవచ్చని ఐఎంఎఫ్‌ ‌ప్రధాన ఆర్థిక శాస్త్ర వేత్త గీతాగోపీనాథ్‌ అన్నారు. వైద్య ఖర్చులు పెరగవచ్చు.

కరోనా వల్ల బాగా దెబ్బతిన్న దేశాలు జాతీయ హెల్త్ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్లను ఏర్పాటు చేయవల్సి ఉంటుంది. నిరుద్యోగ భృతిని తాత్కాలికంగా పెంచాల్సి ఉంటుంది. దక్షిణకొరియా, తైవాన్‌, ‌జపాన్‌ ‌వంటి దేశాలు కోవిడ్‌-19 ‌ప్రభావిత ప్రాంతాల్లో సంప్రదాయ సంస్థల ద్వారా చర్యలు తీసుకుం టున్నాయి. సంక్షోభాలు ఎదుర్కొనేందుకు సంప్రదాయ రీతుల్లో అనుభవించే పద్దతులను అనుసరిస్తున్నాయి. దక్షిణకొరియా వేతనాల సబ్సిడీని అమలు జేస్తోంది. చైనా సామాజిక భద్రత విరాళాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆర్థిక పరమైన చర్యలను సమన్వయ పరుస్తూ ప్రజలపై భారాన్ని తగ్గించే యత్నాలను ఈ దేశాలు అనుసరిస్తున్నాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునే రీతిలో పథకాలను అమలు జేస్తున్నాయి. వైరస్‌ అదుపులోకి వస్తే ఆంక్షలను ఎత్తేస్తారు. వినియోగదారుల ఖర్చులు పెరిగేందుకు చర్యలు తీసుకుంటారు.
– ద వైర్‌ ‌సౌజన్యంతో

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy