Take a fresh look at your lifestyle.

బిసి హాస్టళ్లలో కోవిడ్‌ ‌పరీక్షలు

  • మాస్కులు దరించిడం తప్పనిసరి
  • అధికారులను ఆదేశించిన మంత్రి వేణుగోపాల కృష్ణ

బీసీ స్కూల్స్ ,‌హాస్టల్స్ ‌విద్యార్దులకు కోవిడ్‌ ‌పరీక్షల నిర్వహణ, మాస్కులు ధరించడం, శానిటైజర్ల వినియోగంపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆదేశించారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారుల తో సవి•క్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావే శంలో రాష్ట్రంలోని బీసీ హాస్టల్స్ ‌లో భోజన వసతి ఏర్పాట్లు, నాణ్యమైన భోజనం బీసీ వసతీగృహాల్లో కల్పించేలా చర్యలు చేపట్టాలని, మెరుగైన మౌలిక వసతులు అందించేలా అధికారులను అదేశిం చారు. బీసీ  హాస్టల్స్, ‌స్కూల్స్ ‌లలో  మరుగుదొడ్ల నిర్వహణ, శానిటేషన్‌ ‌చర్యలపై అధికారులతో మంత్రి ఆరా తీసారు. ముఖ్యమంత్రి శ్రీ వై.యస్‌. ‌జగన్మోహన్‌ ‌రెడ్డి గారి ఆశయ సాధనకు అనుగు ణంగా దేశంలోనే ఉత్తమమైన పాఠశాలలుగా బీసీ సంక్షేమ పాఠశాలలను రూపుదిద్దాలని, దీనికోసం మౌలిక సదుపాయాల కల్పనలో మన శాఖ రోల్‌ ‌మోడల్‌ ‌గా వుండాలని అధికారులకు చెప్పారు. ఈ సవి•క్షాసమావేశంలో బీసీ వెల్పేర్‌ ‌ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాములు, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ‌బి. రామా రావు, జ్యోతిరావు ఫూలే స్కూల్స్ ‌సెక్రటరీ కృష్ణమోహన్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply