Take a fresh look at your lifestyle.

చాపకింద నీరులా ఒమిక్రాన్‌ ‌వైరస్‌..

  • ‌పలు రాష్ట్రాల్లో కేసుల నిర్ధారణ
  • దేశంలో కొత్తగా 9216 రోజువారీ కొరోనా కేసులు…24 గంటల్లో 391 మంది మృతి
  • మొదటి రెండు ఒమిక్రాన్‌ ‌కేసులకు సంబంధించి 500 ప్రాథమిక, ద్వితీయ పరిచయాలు
  • 40 ఏళ్లు పైబడిన వారు బూస్టర్‌ ‌డోస్‌ ‌తీసుకోవాలి : భారత కోవిడ్‌ ‌జెనోమిక్స్ ‌సీక్వెన్సింగ్‌ ‌కన్సార్టియం వెల్లడి
  • ఒమిక్రాన్‌పై ‘కోవాగ్జిన్‌’ అత్యంత ప్రభావవంతం : ఐసీఎంఆర్‌ అధికారి వెల్లడి
  • ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌కోసం ఔషధాన్ని తయారు చేసిన బ్రిటన్‌

దేశంలో ఒమిక్రాన్‌ ‌వైరస్‌ ‌చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే బెంగుళూరులో ఒక వైద్యుడితో పాటు ఇద్దరికి ఈ వైరస్‌ ‌సోకింది. దీంతో దేశంలోకి ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌ప్రవేశించినట్టు నిర్ధారణ అయింది. ఇపుడు దేశ వ్యాప్తంగా 40కి పైగా అనుమానిత ఒమిక్రాన్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు ఉన్నట్టు సమాచారం. ఈ కేసుల్లో మహారాష్ట్రలో 28, ఢిల్లీలో 12 చొప్పున ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం. మహారాష్ట్రలో అనుమానిస్తున్న 28 ఒమిక్రాన్‌ ‌కేసుల్లో ఏకంగా 10 మంది రోగులు రాజధాని ముంబైకు చెందిన వారే కావడం గమనార్హం. అలాగే, ఢిల్లీలో 12 అనుమానిత కేసులను గుర్తించారు. వీరందరినీ లోక్‌ ‌నాయక్‌, ‌జై ప్రకాష్‌ ‌నారాయణ్‌ ‌హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం ఎనిమిది అనుమానితులను హాస్పిటల్‌లో చేర్చగా శుక్రవారం మరో నలుగురిని తరలించారు. ఇదిలావుంటే, గురువారం ఒక్క రోజే వివిధ దేశాల నుంచి 861 మంది ప్రయాణికులు దేశంలోకి వొచ్చారు. వీరిందరికీ ఆర్టీపీసీఆర్‌ ‌పరీక్షలు చేయగా, ఇందులో 28 మందికి ఒమిక్రాన్‌ ‌వైరస్‌ ‌సోకినట్టు అనుమానిస్తున్నారు. ఈ 28 మందిలో 25 మంది అంతర్జాతీయ ప్రయాణికులు కాగా, మరో ముగ్గురు వారి కాంటాక్ట్‌లని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 12 నుంచి 22వ తేదీల మధ్య బెంగుళూరుకు వొచ్చిన 10 మంది సౌతాఫ్రికా వాసులు ఆచూకీ తెలియడం లేదు. వారు మొబైల్స్ ‌కూడా స్విచాఫ్‌ ‌చేసివున్నాయి. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు కర్నాటక ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ వ్యక్తుల ఆచూకీ గుర్తించేందుకు పోలీసుల సహకారం తీసుకుంటున్నారు.

దేశంలో కొత్తగా 9216 రోజువారీ కొరోనా కేసులు… 24 గంటల్లో 391 మంది మృతి
దేశంలో కొత్తగా 9216 కొరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. ఇందులో 3,40,45,666 మంది వైరస్‌ ‌నుంచి కోలుకోగా, 99,976 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,70,115 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 391 మంది కొరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. 8612 మంది వైరస్‌ ‌నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌గురించి దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కొంత స్టడీ చేశారు. ఆందోళనకరమైన ఈ వేరియంట్‌పై కొన్ని అంశాలను వెల్లడించారు. ఒమిక్రాన్‌తో రీఇన్‌ఫెక్షన్‌కు అధిక అవకాశాలు ఉన్నట్లు తేల్చారు. డెల్టా లేదా బీటా స్టెయ్రిన్‌ ‌వైరస్‌లతో పోలిస్తే.. కొరోనా ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌వల్ల ఇన్‌ఫెక్షన్లు మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ దేశానికి చెందిన ఆరోగ్య శాఖ సేకరించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని తేల్చారు. దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను మెడికల్‌ ‌జర్నల్‌లో అప్‌లోడ్‌ ‌చేశారు. అయితే నిపుణులు ఈ నివేదికను పరిశీలించాల్సి ఉంది. సుమారు 28 లక్షల మంది పాజిటివ్‌ ‌తేలగా.. వారిలో 35,670 మందికి రీఇన్‌ఫెక్షన్‌ ‌వొచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 90 రోజుల వ్యవధి తర్వాత మళ్లీ పరీక్ష చేస్తే, అప్పుడు పాజిటివ్‌ ‌వొస్తే ఆ కేసుల్ని రీఇన్‌ఫెక్షన్లుగా భావిస్తారు.

మొదటి రెండు ఒమిక్రాన్‌ ‌కేసులకు సంబంధించి 500 ప్రాథమిక, ద్వితీయ పరిచయాలు
భారతదేశంలో బయటపడ్డ కోవిడ్‌ ‌వైరస్‌ ‌కొత్త వేరియంట్‌ ‌మొదటి రెండు కేసులకు సంబంధించి దాదాపు 500 ప్రాథమిక మరియు ద్వితీయ పరిచయాలు కనుగొనబడ్డాయి. వారికి సంబంధించిన తదుపరి పరిశోధనలు కొనసాగుతున్నాయి. కొత్త వేరింట్‌ ‌నమోదైన రెండే కేసుల్లో ఇద్దరు పురుషుల్లో ఒకరు దక్షిణాఫ్రికా నుండి ప్రయాణించిన 66 ఏళ్ల రెండు డోసులు తీసుకున్న వ్యక్తి నవంబర్‌ 20‌న కర్ణాటక విమానాశ్రయంలో కోవిడ్‌ ‌పరీక్ష కోసం నమూనాను సేకరించిన అనంతరం అతను ఒక హోటల్‌లోకి నివసించినట్లు గురించారు.

40 ఏళ్లు పైబడిన వారు బూస్టర్‌ ‌డోస్‌ ‌తీసుకోవాలి : భారత కోవిడ్‌ ‌జెనోమిక్స్ ‌సీక్వెన్సింగ్‌ ‌కన్సార్టియం వెల్లడి
40 ఏళ్లు పైబడినవారందరూ కోవిడ్‌ ‌టీకా బూస్టర్‌ ‌డోసు తీసుకోవాలని టాప్‌ ఇం‌డియన్‌ ‌జీనోమ్‌ ‌సైంటిస్టులు సిఫార్సు చేశారు. కోవిడ్‌ ‌యొక్క జన్యు వైవిధ్యాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ పరీక్షా ప్రయోగశాలల నెట్‌వర్క్ అయిన భారత కోవిడ్‌ ‌జెనోమిక్స్ ‌సీక్వెన్సింగ్‌ ‌కన్సార్టియం వారపు బులెటిన్‌లో ఈ సిఫార్సు చేసింది. టీకాలు తీసుకోని ప్రమాదంలో ఉన్న వ్యక్తులందరికీ టీకాలు వేయడం, 40 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి బూస్టర్‌ ‌డోస్‌ను పరిగణనలోకి తీసుకోవడం, ముందుగా అత్యంత అధిక-రిస్క్,‌వైరస్‌ ‌సోకే ప్రమాదం ఎక్కువగా కలిగి ఉన్న వారిని లక్ష్యంగా చేసుకోవడం పరిగణించబడాల్సిన విషయమని సంస్థ బులెటిన్‌ ‌తెలిపింది. దేశంలో కొరోనా పరిస్థితిపై లోక్‌సభలో చర్చ సందర్భంగా సభ్యులు కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌బూస్టర్‌ ‌డోస్‌ ‌కోసం డిమాండ్‌,‌కొత్త కోవిడ్‌ ‌వేరియంట్‌ ఒమిక్రాన్‌ ‌కలకలం రేపుతున్న నేపథ్యంలో ఈ సిఫార్సు తెరమీదకు వొచ్చింది. అవసరమైన ప్రజారోగ్య చర్యలను ప్రారంభించడానికి, ఈ వేరియంట్‌ ఉనికిని ముందస్తుగా గుర్తించడానికి జన్యుపరమైన నిఘా చాలా కీలకమని సంస్థ తెలిపింది.

ఒమిక్రాన్‌పై ‘కోవాగ్జిన్‌’ అత్యంత ప్రభావవంతం : ఐసీఎంఆర్‌ అధికారి వెల్లడి
హైదరాబాద్‌లోని భారత్‌ ‌బయోటెక్‌ ‌తయారు చేసిన ‘కోవాగ్జిన్‌’ ‌కొరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుందని, అందుబాటులో ఉన్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా కోవాగ్జిన్‌ ‌మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని ఐసిఎంఆర్‌ అధికారి వెల్లడించారు. అయితే, ఒమిక్రాన్‌పై ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మరిన్ని నమూనాలను స్వీకరించి పరీక్షించాల్సి ఉందని, అప్పుడే మరింత స్పష్టత వస్తుందని తెలిపారు. దీనిపై ఐసీఎంఆర్‌ అధికారి మాట్లాడుతూ..‘కోవాగ్జిన్‌ అనేది వైరియన్‌ -ఇనాక్టివేటెడ్‌ ‌టీకా. ఇది మొత్తం వైరస్‌ను అంతం చేసేలా కవర్‌ ‌చేస్తుంది. ఇది అత్యంత పరివర్తన చెందిన కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా పని చేస్తుంది.’’ అని వివరించారు. కోవాగ్జిన్‌ ‌కేవలం ఒమిక్రాన్‌పైనే కాదు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వంటి ఇతర వేరియంట్లపై కూడా బాగా పనిచేస్తుందని అధికారి పేర్కొన్నారు.

ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌కోసం ఔషధాన్ని తయారు చేసిన బ్రిటన్‌
ఒమిక్రాన్‌ ‌గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, కొత్తగా పుట్టుకొచ్చిన ఈ ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌కోసం ఔషధాన్ని గుర్తించినట్లు బ్రిటన్‌ ‌తెలిపింది. ఈ ఔషధం పేరు ‘సోట్రోవిమాబ్‌’ అని వెల్లడించింది. ఫార్మా దిగ్గజం గ్లాక్సో స్మిత్‌ ‌క్లైన్‌ ‌సంస్థ ఉత్పత్తి చేస్తున్న సోట్రోవిమాబ్‌ ఉపయోగించడానికి బ్రిటన్‌ ‌ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కోవిడ్‌ ‌సోకిన వారికి ఈ ఇంజెక్షన్‌తో యాంటీబాడీ చికిత్స చేయగా, వారిలో మంచి ఫలితాలు కనిపించాయని పరిశోధకులు తెలిపారు. ఒమిక్రాన్‌ ‌కోసం వొచ్చిన ఈ ఇంజెక్షన్‌తో 79 శాతం మరణించే ప్రమాదం తగ్గినట్లు గుర్తించింది. ఈ ఔషధాన్ని పరిశోధకులు ముందుగా నరాల ద్వారా ఎక్కించగా, కొరోనా వైరస్‌ ఈ ‘‌సోట్రోవిమాబ్‌’ ‌మెడిసిన్‌ ‌మానవ కణాల్లో ప్రవేశిచండాన్ని సమర్థంగా అడ్డుకుందని పరిశోధకులు చెబుతున్నారు. కొరోనా సోకిన వారికి ఈ మెడిసిన్‌ ‌మొదటి డోసుతోనే మంచి ఫలితాలు వొచ్చినట్లు తెలిపారు. కోవిడ్‌ ‌లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోగా ఈ ఔషధాన్ని అందించాలని బ్రిటన్‌కు చెందిన ది మెడిసిన్స్ అం‌డ్‌ ‌హెల్త్ ‌కేర్‌ ‌ప్రొడక్టస్ ‌రెగ్యులేటరీ ఏజెన్సీ వెల్లడించింది.

Leave a Reply