Take a fresh look at your lifestyle.

నిజాం సర్కార్‌ని ఎదిరించిన సింహం..

నేడు ఆదివాసి హక్కుల కోసం పొరాడిన యోధుడు కొమురం భీం జయంతి
అతను ఒక అగ్గి బారాటా.పోరాట యోధుడు.మీసం మెలితిప్పే వీరుడు.గెరిళ్ళ పోరాటం లొ మడమ తిప్పని త్యాగధనుడు వీరి పేరు చెబితే నిజాం సర్కారు కు దడ పుట్టేదట. స్వయం పాలన కోసం శ్రమించిన తెలంగాణ బిడ్డ కొమురం భీమ్‌ అక్టోబర్‌ 22, 1901‌న జన్మించాడు. హైదరాబాదు విముక్తి కోసం అసఫ్‌ ‌జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్‌ ‌జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఇతను ఆదిలాబాద్‌ అడవులలో, గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబారు దంపతులకు ఆదిలాబాద్‌ ‌జిల్లా, ఆసిఫాబాద్‌ ‌తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో కొమరం భీమ్‌ 1901 ‌సంవత్సరంలో జన్మించాడు. పదిహేనేళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది. కొమరం బీమ్‌ ‌నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు.ఇతను అడవిని జీవనోపాధిగా చేసుకొని, అన్ని రకాల నిజాం అధికారాలను తోసిపుచ్చాడు. అతను నిజాం నవాబ్‌ ‌సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి వీరమరణం పొందాడు.

భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీమ్‌ ‘‌జల్‌-‌జంగిల్‌-‌జమీన్‌’ ‌నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడు. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయుంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్‌ ‌నైజాం సర్కార్‌ ‌గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు.భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్‌ ‌కు వలస వెళ్లింది.

Prajatantra News, Telugu Kavithalu, Telangana updates

అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్‌ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్‌ ‌తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్‌ ‌పరిసర ప్రాంతాలు, జోడేఘాట్‌ ‌గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. భీమ్‌ ‌కు కుడిభజంగా కొమురం సూరు కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు.వెడ్మ రాము కూడా భీమ్‌ ‌కు సహచరుడిగా ఉన్నాడు. కుర్దు పటేల్‌ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్‌ 27 ‌న జోడేఘాట్‌ అడవుల్లోని కొమురం భీమ్‌ ‌స్థావరాన్ని ముట్టడించి భీమ్‌ ‌ని హతమార్చాయి. నిజాం సైన్యంమీద, అటవీ సిబ్బంది పైనా కొమరం కొదమసింహం లా గర్జించాడు. కుర్దు పటేల్‌ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో, అర్ధరాత్రి కొమరం స్థావరాలను సైన్యం చుట్టుముట్టగా జోడేఘాట్‌ అడవుల్లో 1940, అక్టోబర్‌ 27 ‌న, అంటే ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీమ్‌ ‌వీరమరణం పొందాడు. అప్పటి నుంచీ ఆ తిథి రోజునే కొమరం భీమ్‌ ‌వర్ధంతి జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీ.

ఆదిలాబాద్‌ ‌జిల్లాలోని గోండులు ఎప్పటికీ ఒక రాజ్య భావనలో ఇమిడిలేరు. వారు స్వేచ్ఛా ప్రియులు. వారి జీవనాధారమైన అడివినుంచి వారిని తరిమేసే విధానాలు, చట్టాలతో వారు తలపడ్డారు. ఆదివాసీ ఆవాసాల్లోకి గిరిజనేతర భూస్వాముల వలస నిరాటంకంగా సాగింది. పోడు వ్యవసాయం గోండుల జీవనాధారం. అడవిని నరికి పంటవేస్తే అది జంగ్లాత్‌ ‌భూమి అని ఒకరు, కాదు రెవెన్యూ భూమి అని మరొకరు వచ్చి గోండులను వారి భూముల నుంచి తరిమేశారు. పంటలను ధ్వంసం చేశారు. జరిమానాలతో వేధించారు. ఈవేధింపులు, అణచివేతల నేపథ్యంలోంచే..ఆదిలాబాద్‌ ‌గోండన్నలు పోరుబాట పట్టారు.తమ విముక్తి కోసం పోరాట జెండాపట్టారు. ‘మాఊర్లో మా రాజ్యం’అంటూ పన్నెండు గూడాలు బాబేఝరి లోద్దుల్లో తుడుం మోగించాయి. కొమురంభీం నాయకత్వంలో ఆదివాసులు సంఘటితమై తమపై జులుం చేస్తున్న దోపిడీవర్గాలపై తుడుం మోగించారు. కొమురంభీం పోరాటం పలు ప్రాంతాలకు విస్తరించే లోపే నిజాం సేనలతో యుద్ధం జరిగింది. భీంతో సహా పన్నెండు మంది ఆదివాసీ వీరులు అమరులయ్యారు. నిజాం సర్కారు పాశవికంగా కొమరంభీం పోరాటాన్ని అణచివేసింది.

ఆ కాలంలో అరకకు ఐదు రూపాయలు, పోడుకు రెండు రూపాయల చొప్పున పన్నును ఆసిఫాబాద్‌ ‌తహసిల్దార్‌కు కట్టేవారు. కొమురం భీం అప్పటి తహసిల్దార్‌తో మాట్లాడి లచ్చుప చెందిన పన్నెండు ఎకరాల భూమి కేసును కొట్టేయించాడు. అప్పటినుంచి ఆ ప్రాంత గిరిజనులందరికీ భీం నాయకుడయ్యాడు. 70 ఎకరాల అడవిని నరికి 17 గ్రామాలను.,వీరి గొప్పతనం ప్రతి ఒక్క రిలో స్పూర్తి నింపాలి.వీరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.వారిని నిత్యం స్మరించికునేలా కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ ‌జిల్లా పేరు పెట్టడం వారి కృషి కి నిదర్శనం.ఆధివాసిల సంక్షేమం కి ప్రభుత్వము పెద్ద పీట వేయాలి.వారికి మంచి విద్య,వైద్యం అందుబాటులో వుంచాలి.ప్రతి జిల్లా లో కొమురం భీమ్‌ ‌కాంస్య విగ్రహం ని ఏర్పాటు చేయాలి.

– కామిడి సతీష్‌ ‌రెడ్డీ,
జడలపేట,జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా.9848445134

Leave a Reply