Take a fresh look at your lifestyle.

అయ్యా కొడుకుల డ్రామాలు ..!

  • కొరోనా వైద్యం అందించడంలో కెసిఆర్‌ ‌విఫలం
  • కొరోనాను ఎందుకు ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు
  • ప్రజలను నిర్లక్ష్యం చేయడం తగునా ?
  • రాష్ట్రంలో తండ్రీ కొడుకుల డ్రామాలు ఆపాలన్న కోమటిరెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి మండిపడ్డారు. కొరోనా విషయంలో కేసీఆర్‌ అసలు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. కేసీఆర్‌ ‌నీకు మానవత్వం ఉందా? కొరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చుతానని అసంబ్లీ సాక్షిగా చెప్పావు కదా ఏమయ్యింది? కొరోనాను ఆరోగ్య శ్రీలో ఎప్పుడు చేర్చుతారని కేటీఆర్‌ను ప్రజలు ట్విట్టర్‌ ‌వేదికగా నిలదీస్తున్నారు. ఈ విషయాన్ని మి దృష్టికి కేటీఆర్‌ ‌తీసుకవచ్చారా లేదా కేసీఆర్‌? ‌రాష్ట్రంలో అయ్యా కొడుకుల డ్రామాలు ఆపండి. కొరోనా నుంచి ప్రజలను కాపాడండి. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడనికి నీకు అర్హుతా లేదు కేసీఆర్‌. ‌నీ పాలన చూసి తెలంగాణ తల్లి కన్నీరు పెడుతోంది. కేసీఆర్‌కు ప్రజల ఉసురు తగులుతుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు ఉరికించి కోడ్తారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు. కొరోనాతో రాష్ట్ర ప్రజలు పిట్టల్లా చనిపోతుంటే కేసీఆర్‌ ఏం ‌చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కొరోనా పరిస్థితులపై ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే అధికారం నీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. కుటుంబపాలనకు స్వస్తి పలికి.. ప్రజల కోసం ఆలోచించండి. కొరోనా నుంచి ప్రజలను కాపాడండి. కొరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే అయ్యాకొడుకులను చరిత్ర క్షమించదు. కొరోనాతో అల్లాడుతున్న వారికి ఉచిత వైద్యం అందించకపోతే అధికారంలో ఉండి ఏం ఉద్ధరిస్తావు? ప్రజలను కాపాడలేకపోతే ఎందుకు నీకు ఈ ముఖ్యమంత్రి పదవి? కొరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడనికి నీకు అర్హత లేదు.

నువ్వు పాలన సాగించేది ప్రజల కోసమా? నీ కుటుంబం కోసమా? నీ పాలన చూసి తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుంది. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. కేసీఆర్‌కు ప్రజల ఉసురు తగులుతుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ‌కొరోనా ను ఆరోగ్యశ్రీలో చేరుస్తానని చెప్పాడు కదా… మరి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతుంది మికు కనిపించడం లేదా? ఎమ్మెల్యేలు, మంత్రులు గుడ్డి గుర్రాల పళ్ళు తొముతున్నారా? ప్రజలు ఓట్లేస్తేనే కదా మిరు గెలిచింది.

మరి ప్రజలు కొరోనాతో పోరాటం చేస్తుంటే మి ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీయడం లేదన్నారు.ప్రభుత్వ నిర్వాకం వల్ల మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇంకా ఎంతమంది పేదల ప్రాణాలు పోవాలి? కొరోనా తో చనిపోతున్న వారివి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌ ‌ల్లో లక్షలు లక్షలు పెట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేకనే చనిపోతున్నారు. కొరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు ఉరికించి ఉరికించి కోడ్తరు. కేసీఆర్‌ ఇకనైనా కళ్లు తెరిచి.. కొరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చండి’ అని కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply