Take a fresh look at your lifestyle.

కేసీఆర్ కుటుంబమంత జైలుకు వెళ్లే రోజు దగ్గరుంది..కోమటిరెడ్డి

komatireddy-venkat-reddy prjatantra

25 ఏండ్లలో ఇంత దరిద్రమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.రజకార్లకంటే దారుణంగా పోలీసులు వ్యవహరించారని మండిపడ్డారు.మంగళవారం గాంధీభవన్ లో కోమటిరెడ్డి మీడియా తో మాట్లాడుతూ …కేటీఆర్ సిరిసిల్లలో రెబల్స్ పోటీ చేస్తే వారిని సస్పెండ్ చేస్తానని మళ్లీ పార్టీలో చేర్చుకున్నారని ,కేటీఆర్ సిగ్గుందా నీది నోరా తాటిమట్టానా అంటూ విమర్శించారు. గజ్వేల్లో మునిసిపల్ ఛైర్మెన్ గా 74ఏడ్ల నారాయణ రెడ్డి ని చేస్తామని మోసం చేసారన్నారు.గతంలో మా ఎమ్మెల్యేలు తీసుకుంటే నీ బిడ్డ ఓడిపోయిందని అన్నారు.పైనదేవుడున్నాడు మున్సిపల్ ఎన్నికల్లో చేసింది వదిలిపెట్టడన్నారు.కేసీఆర్ కేటీఆర్ లు సిగ్గు లజ్జలేకుండా పనిచేస్తున్నారని ,మున్సిపల్ ఎన్నికల ప్రకటన ముందే జిల్లా మంత్రులను ఎమ్మెల్యేలను సీఎం బ్లాక్ మెయిల్ చేసారని ఆరోపించారు.

- Advertisement -

మంత్రులు ఎమ్మెల్యేలు దోచుకున్న డబ్బుతో ఇతర పార్టీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ,ఇవి నిజాయితీగా జరిగిన ఎన్నికలు కావన్నారు.ఎక్స్ అఫిషియో ఓట్లతో యాదగిరిగుట్టు కైవసం చేసుకున్ననారని ,ఆదిభట్ల లో మాకు మోజారిటి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్ తీసుకుపోయి టీఆర్ఎస్ నుంచి ఛైర్మన్ చేసారని , పెద్ద అంబర్ పేట లో మా కౌన్సిలర్స్ ను చౌటుప్పల్లో అలాగే ఎత్తుకు పోయారని ప్రభుత్వం పై ధ్వజమెత్తారు .టీఆరెస్ వాళ్ళని వదిలి పెట్టమని గ్రామ గ్రమాన తిరిగి ఎండ గడుతామన్నారు.కేసీఆర్ కుటుంబం మొత్తం జైలు కు వెళ్లే రోజు వస్తుందన్నారు.కేసీఆర్ కుటుంబం చేసిన స్కాంలు పై ఆధారాలతో ఈడికి,విజులెన్స్ కు ఇస్తానన్నారు.టీఆరెస్ దోపిడిని పార్లమెంటులో ఎండగడుతామన్నారు.రెండు మూడు రోజుల్లో విద్యుత్తు చార్చీలు పెంచుతారని, చిన్న చిన్న గ్రామాలను మున్సిపాలిటీలు చేశారు వాటిల్లో పన్నులు పెంచుతారని తెలిపారు.తెలంగాణ వచ్చింది కేసీఆర్ కేటీఆర్ లకు మాత్రమేనన్నారు. నాకు పిసిసి పదవిస్తే చేస్తా లేకుంటే కార్యకర్త గా పనిచేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

Tags: komati reddy, venkat reddy,ambharpet, counselor

Leave a Reply