- విభజన హావి•లన్నీ గాలికి..
- నిధుల కేటాయంపులో తీరని అన్యాయం
- ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఆంక్షలు
- బడ్జెట్ ప్రసంగంలో కేంద్రంపై మండిపడ్డ హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : ఒక వైపు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంటే..కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు వి•ద అడ్డంకులు సృష్టిస్తుందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పెడుతున్న ఆంక్షలు, తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికిలో బడి బడ్జెటేతర రుణాలు సవి•కరించిందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మనకున్న ఆర్థిక సామర్థ్యం మేరకు రుణ పరిమితిని రూ.53,970 కోట్లుగా బ్జడెట్‌లో పొందుపరిచి సభలో ఆమోదించుకున్నామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రూ.15,033 కోట్లు కోత పెట్టి ఈ పరిమితిని రూ.38,937 కోట్లకు తగ్గించినట్లు చెప్పారు. ఈ నిర్ణయం పూర్తిగా అసంబద్ధమైనదని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం చేసే సిఫారసులను యథాతథంగా అమలుపరిచే సత్సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. పన్నుల వాటాలో తెలంగాణకు 2019-20 సంవత్సరంలో ఇచ్చిన మొత్తానికి తగ్గకుండా రూ.723 కోట్లు స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని, పోషకాహార కార్యక్రమాల కోసం రూ.171 కోట్లు గ్రాంటు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినప్పటికీ కేంద్రం ఇవ్వకుండా మొండి చేయి చూపింది.
2021-26 సంవత్సరాలకు గానూ 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రూ.5,374 కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని సిఫారసు చేస్తే ఇవి కూడా ఇవ్వకుండా తీవ్రమైన అన్యాయం చేసింది. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఈ విధంగా ఆర్థిక సంఘం సిఫార్సులను బేఖాతరు చేయలేదు’ అని మంత్రి తెలిపారు. ఆంధప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(1) ప్రకారం తెలంగాణ, ఆంధప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ కేంద్ర పన్నుల్లో రాయితీలు ప్రకటించి తద్వారా ఆర్థిక, పారిశ్రామిక, అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు రాయితీలతో ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలనూ దెబ్బతీసిందని మండిపడ్డారు. ‘విభజన చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయించాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.450 కోట్లు చొప్పున తెలంగాణకు ఇవ్వాల్సి ఉండగా.. మూడు సంవత్సరాలకు గానూ రూ.1,350 కోట్లు ఇవ్వనేలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి రూ.19,205 కోట్లు, మిషన్ కాకతీయ పథకానికి రూ.5,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
కానీ కేంద్ర సర్కారు ఒక్కపైసా కూడా ఇవ్వలేదని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీని స్థాపించాలని పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొంది. ఎనిమిదిన్నరేండ్లయినా ఈ హావి•లు నెరవేరలేదు. పైగా మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రాష్ట్రానికి రాకుండా చేసింది. నదీజలాల చట్టం సెక్షన్ 3ను అనుసరించి నూతన రాష్ట్రమైన తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల వాటాను నిర్ణయించాలని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం సూచించాల్సి ఉంది. కానీ కేంద్రం చేస్తున్న అకారణమైన కాలయాపన వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిపై తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకం కలుగుతుంది. ట్రిబ్యునల్ తీర్పుల పేరిట దశాబ్దాల తరబడి జరుగుతున్న అర్థం పర్థం లేని కాలయాపనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా నిరసిస్తుందని మంత్రి పేర్కొన్నారు. 2022 ఆగస్టులో కేంద్ర విద్యుత్ శాఖ బకాయిల చెల్లింపు పేరిట ఇచ్చిన ఉత్తర్వులు తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షకు మరో నిదర్శనం. విద్యుత్తు సరఫరాకు సంబంధించి రూ.3,441.78 కోట్లను అసలు కింద, రూ.3,315.14 కోట్లను వడ్డీ కింద లెక్క వేసి మొత్తంగా రూ.6,756.92 కోట్లను తెలంగాణ డిస్కంలు ఏపీజెన్‌కోకు 30 రోజుల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విద్యుత్తు శాఖ ఆదేశాలిచ్చింది. విద్యుత్తు వినియోగానికి సంబంధించి ఆంధప్రదేశ్ నుంచి మన రాష్టాన్రికి రావాల్సిన రూ.17,828 కోట్ల బకాయిలు ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదు. చివరకు కోర్టును ఆశ్రయించడం తప్ప తెలంగాణకు మరో మార్గం లేకపోయిందన్నారు. 2014-15 రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్ర పథకాల కింద ఇవ్వాల్సిన రూ.495 కోట్లను కేంద్ర మంత్రిత్వ శాఖలు బాధ్యతా రాహిత్యంగా ఆంధప్రదేశ్‌కు బదిలీ చేశాయి. ఉద్దేశపూర్వకంగానో లేక పొరపాటునో జరిగిన ఈ అన్యాయాన్ని సవరించమని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను కేంద్రం పెడచెవిన పెడుతోంది. ఆంధప్రదేశ్ ఖాతాలో వేసిన నిధులను తెలంగాణకు తిరిగి సర్దుబాటు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది.
సాక్షాత్తు పార్లమెంట్ ఆమోదించిన పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అనేక అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం పూర్తిగా అప్రజాస్వామికం. కేంద్రం సహకారం లేకపోయినా..గత ఎనిమిదిన్నరేండ్లలో రాష్ట్రం సాధించిన గణనీయమైన ప్రగతి వివరాలను సంక్షిప్తంగా సభ ముందుంచుతున్నా’ అని మంత్రి తన ప్రసంగంలో వెల్లడించారు. విద్యుత్ బకాయిల విషయంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగుతున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలు బాధ్యతా రాహిత్యంగా ఆంధప్రదేశ్‌కు బదిలీ చేశాయని విమర్శించారు. ఈ అన్యాయాన్ని సవరించాలని ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర పెడచెవిన పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విధంగా కేంద్ర సహకారం లేకపోయినా గత ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధించాన్నారు.