Take a fresh look at your lifestyle.

కోలార్‌ ‌జిల్లా తహశీల్దార్‌ ‌హత్య దుర్మార్గమైన చర్య: తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం

‌కర్నాటక రాష్ట్రంలోని కోలార్‌ ‌జిల్లా బంగారుపేట తహశీల్దార్‌ ‌చంద్రమౌళిని అత్యంత కిరాతకంగా హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ ‌సర్వీసెస్‌ అసోసియేషన్‌ (‌ట్రెసా) రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామనీ, నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేసింది. ఈమేరకు శుక్రవారం ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతంకుమార్‌ ‌శుక్రవారం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలులో నిరంతరం కృషి చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై దాడులు జరగడం, హత్య చేయడం బాధాకరమని పేర్కొన్నారు.

భూముల విలువ పెరగడం వల్లనే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారనీ, ఎలాగైనా అట్టి భూములను దక్కించుకోవాలనే స్వార్థంతో బరితెగించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంఘటనలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం స్పందించి కఠిన చట్టాలు తీసుకొచ్చి ప్రజల ప్రయోజనాలకు, రెవెన్యూ ఉద్యోగుల భద్రతకు భంగం వాటిల్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణలో తహశీల్దార్‌ ‌హత్య ఘటన మరువక ముందే కర్ణాటకలో మరో తహశీల్దార్‌ ‌హత్య జరగడం వల్ల దేశవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రెవెన్యూ ఉద్యోగులకు తగిన  భద్రత ••ల్పించాలనీ, ఇలాంటి ఘటనలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి, గౌతం కుమార్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply