Take a fresh look at your lifestyle.

బెదరింపులు ఆపి చర్చించండి

జెపిసిలకు మద్దతు తెలిపిన కోదండరామ్‌
బెదిరింపులు ఆపి చర్చలు జరిపి  జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శుల,  ఔట్సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని టీజేఎస్‌ ‌చైర్మన్‌ ‌ప్రొఫెసర్‌ ‌కోదండరాం డిమాండ్‌ ‌చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయం వద్ద జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శుల, ఓపిఎస్ల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుంచి తీసేయడం అంటే నైజాం పాలనలో ఉన్నామా రాచరిక పాలనలో ఉన్నామా అర్థం కావడం లేదని అన్నారు. బెదిరింపులు ఆపి చర్చలు జరిపి ప్రభుత్వం సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు హావి• ఇచ్చి మాట తప్పడం శోచనీయం కాదన్నారు. పంచాయతీ కార్యదర్శుల పై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకుని గ్రామస్థాయి నుంచి ఉద్యమం చేస్తామన్నారు. ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్య పద్ధతిలో మంచిది కాదని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు వెట్టి చాకిరి చేస్తున్నారని అన్నారు. ఆత్మగౌరవ పోరాటాన్ని గౌరవించి పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్‌ ‌చేయాలని కోరారు.

తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ ‌చేస్తూ జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. పది రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. మే9న సాయంత్రం 5 గంటలలోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. 9న ఉద్యోగులు విధుల్లో చేరకుంటే విధుల్లో చేరని వారిని తొలగిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply