టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం నాయకత్వంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌తో బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కోదండరాంకు మద్దతు ఇవ్వాలని ప్రతినిధి బృందం చెరుకు సుధాకర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇదే నియోజకవర్గ ఇంటి పార్టీ అభ్యర్థిగా చెరుకు సుధాకర్ బరిలోకి దిగాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, కోదండరాం కూడా ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించినందున ఆయనకు మద్దతు ఇచ్చి గెలిచేందుకు సహకరించాలని ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. చెరుకు సుధాకర్‌ను కలసిన టీజేఎస్ నేతలలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వెంకట్‌రెడ్డి,ప్రొ.పీఎల్ విశ్వేశ్వరరావు, రాజమ్లయ్య ఉన్నారు.