Take a fresh look at your lifestyle.

జ్ఞాన ప్రదాత గణాధిపా..!

‘గ’ అక్షరం జ్ఞానదాయకం
‘ణ’ కారం నిర్వాణ ప్రదాయకం
జ్ఞాన నిర్వాణ శాసక అధిపతి
గణేషతత్వ ఓంకారరూపుడు
జ్ఞాన ఐశ్వర్య ఆరోగ్య ప్రదాతుడు !

విజ్ఞగణాలకే గణపతి
త్రిలోకాల్లో ప్రథమ పూజ్యుడు
దురాచారాలకే విఘ్నకర్త
సదాచారులకు విఘ్నహర్త
సార్థకనామ విఘ్నేశ్వరుడు !

అనంత శక్తి స్వరూపుడు
సర్వకామ  ప్రదుడు
భక్తసులభ వినాయకుడు
ద్వాదశనామ గణేశుడు
విద్యా ప్రదాతే ఫాలచంద్రుడు  !

ఏకదంత కపిల వర్ణుడు
గజకర్ణ లంభోదరుడు
వికటరూపదారి సుముఖుడు
విఘ్ననాశక గజాననుడు
గజాధ్యక్ష ధూమ్రక్తుడు !

గజముఖ శూర్పకర్ణుడు
సద్గుణ మూషిక వాహనుడు
దీర్ఘతుండ మోదక ప్రియుడు
బ్రహ్మానంద భక్తసులభుడు
వక్రతుండ ఆదిదేవుడు !

జ్ఞాన ప్రదాత గణాధిపా..
అతివృష్టికి అడ్డు నిలిచి..
కోవిడ్‌ను లోకంలోంచి తరిమి..
అక్రమార్కుల్ని అంతం చేస్తూ..
విశ్వవిజ్ఞానాన్ని వర్షించు గణేషా !
 – మధుపాళీ, కరీంనగర్‌  9949700037

Leave a Reply