Take a fresh look at your lifestyle.

కివీస్‌ ఆదర్శం దేశాలకూ, పౌరులకూ

“అత్యవసరాలు నిత్యావసరాలకే తప్ప ఎవరినీ రోడ్డెక్కనీయకుండా చేయటం తప్పనిసరై బయటికొచ్చేవారు రక్షణ దుస్తులు ధరించటం చర్యలు పాటించటాన్ని కచ్చితం చేసింది.. అవసరమైన పరీక్షలతో వ్యాధిసోకిన వారిని గుర్తించటం క్వారంటైన్లకు తరలించటం వైద్యం చేయటం వంటివి ఆచరించింది…ఇంత చేసినా కొద్దిపాటి మరణాలు ఆదేశానా చోటు చేసుకోవటం బాధాకరమే అయినా కొద్ది వ్యవధిలోనే తిరిగి కోలుకోగలిగింది.”

దేశాలన్నిటికీ  కివీస్‌ ఆదర్శం విస్తరించాలి కొరోనాను కట్టడి చేసే పారదోలే పోరాటాన చిన్నదేశపు గెలుపు స్ఫూర్తిని యావత్‌ ‌ప్రపంచం ఒంటబట్టించుకోవాలి..కరోనా మహమ్మారిపై పోరాడుతున్న దేశాలకు కివీస్‌ ఇపుడు ఓ రోల్‌ ‌మోడల్‌.. ‌కట్టడి చర్యలకు ఆదేశం ఓ అనుసరణీయ మార్గం.. మహిళా ప్రధాని తన సత్తాను చాటటం  మహిళా లోకానికి గర్వకారణం.. దేశంలో చివరి కొరోనా పాజిటివ్‌ ‌ను నెగిటివ్‌ ‌గా మార్చి ఇంటికి చేర్చింది న్యూజీలాండ్‌.. ‌సోమవారం ఆఖరు రోగినీ స్వస్థత పరిచి ఆక్లాండ్‌ ‌లోని సెయింట్‌ ‌మార్గరేట్‌ ఆసుపత్రి వీడ్కోలిచ్చింది .. ఎవరికీ లొంగకపోతున్న మహమ్మారి కొరోనాపై పైచేయి సాధించింది మహిళా ప్రధాని కాగా మహమ్మారి దాడిలో కోలుకున్న చివరి రోగీ మహిళే కావటం గమనార్హం.. న్యూజీలాండ్‌ ‌లో 1504  కొరోనా కేసులు నమోదు కాగా వారిలో 1154 మందికి పాజిటివ్‌, ‌మరో 350 మంది అనుమానితుల జాబితాలో ఉన్నారు..వైరస్‌ ‌సంక్రమణకు గురైన వారిలో వారిలో 22 మంది మృత్యువాత పడ్దారు. కేసులు ప్రబలకుండా లక్షల సంఖ్యలో విస్తరించకుండా కట్టడి చేయటంలోనే ఆదేశం తొలి విజయం సాధించినట్టైంది..ఒక పక్క ప్రపంచదేశాల్లో కేసుల సంఖ్య లక్షలకు చేరుతున్నా తమ దేశాన పరిస్థితి చేయిదాటకుండా చేసిన ముందస్తు చర్యలే కొరోనాను పూర్తిగా అరికట్టేందుకు దోహదపడ్డాయి..లాక్‌డౌన్‌ ‌నిబంధన ఉల్లంఘించిన ఆదేశమంత్రిపై చర్యలు తీసుకోవటంతోపాటు సెల్‌ ‌ఫోన్‌ ‌సందేశాలద్వారా పౌరలకు అవగాహన కల్పించారు.. దేశ జనాభా 50 లక్షలు మాత్రమే కావటంతో నియంత్రణ సాధ్యపడింది..న్యూజీలాండ్‌లో తొలి కొరోనా పాజిటివ్‌ ‌కేసు ఫిబ్రవరి 28న నమోదయ్యింది.. వ్యాప్తిని సమర్దవంతంగా అరికట్టడమే కాక జూన్‌ 8 ‌కల్లా నియంత్రణలోకి తేవటం వంక ఇపుడు ప్రపంచం దృష్టి సారించింది.. కొరోనా ఆంక్షల అమలులో భాగంగా ఆదేశంలో మార్చి 21 నుంచి లెవెల్‌ 1,2,3,4 ‌నిబంధనలు విధించారు..లెవెల్‌ 4 అమలులో భాగంగా దేశమంతటా లాక్‌ ‌డవున్‌ ‌విధించబడింది..పరిస్థితులు అదుపులోకొస్తున్నందున ఏప్రిల్‌ 27, ‌మే 13 తేదీలలో లాక్‌ ‌డవున్లను దశలవారీ సడలించింది..ఇతర దేశాల తీరుగానే ఏప్రిల్‌ ‌నెలలో రోజుకు దాదాపు 90 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా ప్రభుత్వ ముందుజాగ్రత్త చర్యలు సత్ఫలితాన్నివ్వటంతో క్రమేపీ తగ్గుముఖం పట్టాయి..మే 22 నుంచి కొత్త కేసులు ఏవీ నమోదుకాకపోవటం చివరి పాజిటివ్‌ ‌నెగిటివ్‌ ‌కు చేరటంతో నియంత్రణ సాధించిన దేశంగా గుర్తింపు పొందింది…

ఆదేశంలో కేసుల సంఖ్య తక్కువే కావొచ్చు కానీ వ్యాధి ప్రపంచ వ్యాప్తం మాదిరిదే..కానీ పూర్తిస్థాయిలో కరోనాను పారదోలే లక్ష్యంతో చేపట్టిన చర్యలు ఆ దేశాన్ని భయరహితం చేయటమే కాదు ఇతర దేశాల్లో మనో ధైర్యం నింపాయి.. కరోనా కట్టడి అంతుబట్టని సమస్యగా కొరకరాని కొయ్యగా మారిన క్లిష్ట తరుణంలో ఒక దేశం సాధించిన విజయం తోటి దేశాలకు స్ఫూర్తిదాయకమే..ఇతర దేశాల తీరున కరోనా విజృంభించకపోయినా యావత్‌ ‌దేశాల సంక్లిష్టతకు న్యూజీలాండ్‌ ‌గురయ్యింది.. అయితే ఎన్ని నష్టాలెదురైనా కష్టాలపాలవుతున్నా ప్రజలను కరోనా కబందహస్తాల్లోంచి విడిపించటమే లక్ష్యంగా కృషి చేసింది.. ఆర్ధిక వ్యవస్థకు విఘాతమేర్పడినా లాక్‌ ‌డవున్‌ ‌ను పటిష్టంగా అమలుచేసింది.. గాడి తప్పిన ఆర్దిక గాడిని తిరిగి పట్టాలెక్కించి పరుగులు తీయించవచ్చన్న నమ్మకంతో లాక్‌ ‌డవున్‌ ‌కఠినంగా అమలు చేసింది..

అత్యవసరాలు నిత్యావసరాలకే తప్ప ఎవరినీ రోడ్డెక్కనీయకుండా చేయటం తప్పనిసరై బయటికొచ్చేవారు రక్షణ దుస్తులు ధరించటం చర్యలు పాటించటాన్ని కచ్చితం చేసింది.. అవసరమైన పరీక్షలతో వ్యాధిసోకిన వారిని గుర్తించటం క్వారంటైన్లకు తరలించటం వైద్యం చేయటం వంటివి ఆచరించింది…ఇంత చేసినా కొద్దిపాటి మరణాలు ఆదేశానా చోటు చేసుకోవటం బాధాకరమే అయినా కొద్ది వ్యవధిలోనే తిరిగి కోలుకోగలిగింది..
కొరోనా నియంత్రణ చర్యలకు ఆదేశ అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలకు పౌరులు తమవంతు సహకరించినట్టు తెలుస్తోంది..దేశం పూర్వపు రూపు సాధించాలన్న సంకల్పంతోప్రభుత్వ చర్యలకు తమవంతుగా సహకరించారు.. కరోనా ప్రబలకుండా విస్తృతం కాకుండా స్వీయ జాగ్రత్తలు కోవిడ్‌ ‌నిబంధనలు పాటించారు.. ప్రపంచ పటాన మొదటి కరోనా కట్టడి సాధించిన ఘనతలో న్యూజీలాండ్‌ ‌ప్రభుత్వాన్ని ఎంత అభినందించాలో అంతకు రెట్తింపుగా స్థానిక ప్రజలను అభినందించాలి..ఇది ప్రపంచం చప్పట్లు కొట్టాల్సిన సమయం.. న్యూజీలాండ్‌ ‌ను అభినందించాల్సిన తరుణం.. కరోనా కట్టడి సాధ్యమేనని నిరూపిస్తూ యువ ప్రధాని జెసిండా అడెర్న్ ‌చర్యలను అనుసరించాల్సిన ఆవశ్యం..యుద్ధంలో గెలుపు తధ్యమే అని తొలి సంకేతాన్నిచ్చిన విజేతను అభినందించాల్సిందే…  ఎక్కు పెట్టాల్సిన అస్త్రాలేవో సమకూర్చుకోవాల్సిన ఆయుధాలేవోనన్న సందిగ్దాలకు ఇది దిశా నిర్దేశమే.. కివీస్‌ ‌సాధించిన కట్తడి దేశాలతోపాటు పౌరలకూ ఆచరణీయమే ..ముఖ్యంగా మనదేశంలో..
 – కె.శ్రీనివాస్‌ ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్
9346611455

Leave a Reply