ముఖ్య అతిథిగా పాల్గొననున్న మంత్రి హరీష్రావు
జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గురువారం పతంగుల పండుగను నిర్వహించనున్నారు. సిద్ధిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే ఈ పతంగుల పండుగకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ‘స్వచ్ తెలంగాణ.. స్వచ్ సిద్దిపేట ..స్వచ్ సర్వేక్షన్’పేరుతో సంక్రాంతి సంబురం.. సకల జన సమాహారం.. పతంగుల పండుగ అంబరాన్ని అంటే విధంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ…‘కైట్ ఫెస్టివెల్లో పాల్గొందాం.. స్వచ్ సర్వేక్షన్లో భాగస్వామ్యం అవుదామన్నారు. అందరం కలుద్దాం..పతంగులను ఎగరేద్దాం.. మన ఐక్యతను చాటుదామన్నారు. పిల్లల కేరింతలు.. యువతలో ఉత్సహంతో గాల్లో తేలనున్న పతంగుల సంబరంలో సిద్దిపేట యువతీ, యువకులు, ఉత్సహవంతులు పాల్గొని మన సిద్దిపేట ఐక్యతను చాటి స్వచ్ సర్వేక్షన్లో భాగస్వామ్యం అవుదామనీ మంత్రి హరీష్రావు పిలుపునిచ్చారు.