కొరోనాను తగ్గించే 64 రకాల మందుల విడుదల
హైదరాబాద్,జూన్1: కొరోనా బాధితుల కోసం కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఆయుష్ మందులను విడుదల చేశారు. కొరోనా ను తగ్గించే 64 రకాల మందులను మంత్రి విడుదల చేశారు. వాటిని సేవా భారతి ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక ఆయుష్ డిపార్ట్ మెంట్ లకు పెద్దపీట వేశారని..ఆయుర్వేద మందుల తయారీలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.
టీవీ పెడితే ఆయుర్వేద మందులను తయారు చేసిన ఆనందయ్య పేరే వినిపిస్తోందని.. ఆయుర్వేద మందులపై ప్రజలకు ఉన్న నమ్మకమే ఆనందయ్య పేరు మారుమ్రోగేలా చేస్తోందని అన్నారు. ఆయుష్ మందుల కోసం ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి బ్జడెట్ లో నిధులను కూడా కేటాయించారని గుర్తు చేశారు.